తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి డి.ఎస్. లోకేశ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసిన : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఉన్నతస్థాయి అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శిగా డి.ఎస్. లోకేశ్ కుమార్ ,రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి (రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపులు) రాజీవ్ గాంధీ హనుమంతు భద్రాద్రి ఐడిఓసికి గురువారం చేరుకున్నారు. వీరిని భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ సాదరంగా ఆహ్వానించి మర్యాదపూర్వకంగా కలుసుకొని పూల మొక్కను అందజేశారు. అనంతరం ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో జరుగుతున్న భూ - సర్వే,సాదా బైనమా, రెవిన్యూ సదస్సులు, తదితర అంశాలపై అధికారులతో ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో రివ్యూ సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ రీ సర్వేను సకాలంలో పూర్తిచేయాలని అధికారులకు సలహాలు, సూచనలు అందించారు. ఈ సమావేశంలో ఖమ్మం కలెక్టర్ దివాకర్, భద్రాద్రి జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వేణుగోపాల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట్,కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ కుమార్,ఉమ్మడి జిల్లాల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ