Thursday, 17 September 2026 07:35:57 PM
# శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్

జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహణ

Date : 22 June 2026 05:43 PM Views : 91

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాబోయే పల్స్ పోలియో కార్యక్రమం, స్టాప్ డయేరియా క్యాంపెయిన్ మరియు జాతీయ పురుగుల నివారణ దినోత్సవం (NDD) కార్యక్రమం అమలుపై సమీక్షించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సోమవారం జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్తో పాటు సంబంధిత శాఖల అధికారులు మరియు టాస్క్ ఫోర్స్ సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో జూన్ 28న నిర్వహించనున్న పల్స్ పోలియో బూత్ డే కార్యక్రమం, అనంతరం జూన్ 29 మరియు 30 తేదీలలో ఇంటింటి సర్వే కార్యక్రమం, జూన్ 1 నుండి జూలై 31 వరకు నిర్వహిస్తున్న స్టాప్ డయేరియా క్యాంపెయిన్, అలాగే జూలై 13న నిర్వహించనున్న జాతీయ పురుగుల నివారణ దినోత్సవం (NDD) కార్యక్రమాలపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాలను జిల్లాలో విజయవంతంగా అమలు చేయడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక, శాఖల మధ్య సమన్వయం, ప్రజల్లో అవగాహన కల్పించడం, లక్ష్యిత లబ్ధిదారులకు సేవలు అందించడం వంటి అంశాలపై చర్చించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పటిష్ట పర్యవేక్షణ చేపట్టి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, వైద్య మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.డా.ప్రతాప్ జిల్లా చైల్డ్ హెల్త్ అండ్ ఇమ్యూనిజేషన్ అధికారి

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :