Wednesday, 16 September 2026 05:51:26 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మార్గదర్శకంలో విపత్తు ప్రణాళిక హ్యాండ్‌బుక్ రూపకల్పనకు ఇండియా హౌస్ బృందం విస్తృత పర్యటన

Date : 21 November 2025 06:31 PM Views : 398

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా విపత్తు కార్యాచరణ ప్రణాళిక హ్యాండ్‌బుక్‌ను శాస్త్రీయ ఆధారాలతో, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా రూపొందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచించిన దిశలో, ఇండియా హౌస్ ప్రతినిధి బృందం శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తృత స్థాయి క్షేత్ర పర్యటన నిర్వహించింది. జాహ్నవి, సోనల్ ఘోడ్గే, మురళి (డిప్యూటీ కలెక్టర్) లతో కూడిన ఈ బృందం సహజ వనరులు, పర్యావరణ వ్యవస్థ, అడవి సంరక్షణ, పరిశ్రమల ప్రభావం, వాతావరణ మార్పుల నేపథ్యం వంటి అంశాలను పరిశీలిస్తూ పలు ప్రాంతాలలో ప్రత్యక్ష సమాచారం సేకరించింది. పర్యటనలో భాగంగా ముందుగా సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తున్న నర్సరీలను సందర్శించిన బృందం, గనుల తవ్వకాల వల్ల కోల్పోయిన అడవులను పునరుద్ధరించేందుకు చేపడుతున్న పునర్వనీకరణ చర్యలు, శాస్త్రీయ పద్ధతుల్లో పెంచుతున్న వివిధ జాతుల మొక్కలు, పునరావాసం చేసిన గనుల ప్రాంతాల్లో అమలు చేస్తున్న జీవవైవిధ్యం సంరక్షణ కార్యక్రమాలపై అధికారులు ఇచ్చిన వివరాలను సమగ్రంగా పరిశీలించింది. పర్యావరణ పరిరక్షణ చర్యలలో సింగరేణి సంస్థ చేపడుతున్న నాణ్యతా ప్రమాణాలను కూడా బృందం అధ్యయనం చేసింది. తదుపరి కిన్నెరసాని అభయారణ్యం మరియు కిన్నెరసాని డ్యామ్‌ను సందర్శించిన బృందం, అభయారణ్యంలో అరుదైన వృక్షజాతులు, జంతువులు, అడవి సంరక్షణ పథకాలు, అడవుల నరికివేత వల్ల వాతావరణ మార్పులపై పడుతున్న ప్రభావం వంటి అంశాలను అటవీ అధికారులు వివరించారు. కిన్నెరసాని డ్యామ్‌ వద్ద నీటి నిల్వలు, వరద నియంత్రణ వ్యవస్థ, జలవనరుల నిర్వహణ విధానాలు మరియు డ్యామ్ భద్రతా ప్రమాణాలను బృందం సమీక్షించింది. అటవీ శాఖ అధికారి కృష్ణగౌడ్‌తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లాలో అడవుల ప్రస్తుత స్థితి, అక్రమ వృక్ష నరికివేత నియంత్రణ చర్యలు, వాతావరణ మార్పులతో సంభవించే సహజ విపత్తుల ప్రభావం, వరద‌లు మరియు నేల ధూపాన్ని నిరోధించేందుకు చేపట్టాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు. మాదారం గ్రామంలోని నాయకపొడు మాస్క్ తయారీ కేంద్రాన్ని పరిశీలించిన సందర్భంగా, మాస్క్ తయారీలో వినియోగించే చెక్క మూలాలు, వాటి వల్ల అడవులపై పడే ప్రభావం, పర్యావరణ హిత ప్రత్యామ్నాయాల అమలు వంటి అంశాలను బృందం సమీక్షించింది. అనంతరం దమ్మపేటలోని ఆయిల్ పామ్ పరిశ్రమను సందర్శించి, ఉత్పత్తి విధానాలు, పరిశ్రమ వ్యర్థాల నిర్వహణ, కాలుష్య నియంత్రణ చర్యలపై అధికారులు అందించిన వివరాలను అధ్యయనం చేశారు. రోజంతా సాగిన ఈ విస్తృత క్షేత్ర అధ్యయనంలో బృందం జిల్లాలోని సహజ వనరులు, అటవి వ్యవస్థ, పరిశ్రమల పర్యావరణ ప్రభావం, గ్రామీణ జీవన విధానాలు వంటి పలు కీలక రంగాలపై వివరాలను సేకరించింది. ఈ సమాచారం మొత్తం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మార్గదర్శకంలో రూపుదిద్దుకుంటున్న జిల్లా విపత్తు కార్యాచరణ ప్రణాళిక హ్యాండ్‌బుక్ తయారీలో ప్రధాన ఆధారాలుగా ఉపయోగించబడనున్నాయని అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :