Wednesday, 16 September 2026 09:53:20 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమం, ప్రతి సోమవారం ప్రజావాణి

Date : 14 August 2026 01:33 PM Views : 238

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెంజూలూరుపాడు, ఆగస్టు 14 : ప్రజల సమస్యలను స్థానిక స్థాయిలోనే త్వరితగతిన పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వికేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో భాగంగా ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి తాళ్లూరి రవి తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన G.O.Ms.No.4, Planning (V) Department, తేదీ 04-08-2026 మార్గదర్శకాల ప్రకారం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జూలూరుపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి MPDO నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ప్రజలు తమ శాఖలకు సంబంధించిన సమస్యలు, విజ్ఞప్తులను ప్రజావాణిలో సమర్పించవచ్చని తెలిపారు. సంబంధిత మండల స్థాయి అధికారులు స్వయంగా హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి సకాలంలో అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.మండల స్థాయి అధికారులు ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు తప్పనిసరిగా సమయపాలనతో హాజరై, తమ శాఖలకు సంబంధించిన ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించాలని MPDO తాళ్లూరి రవి కోరారు.ప్రజలకు పారదర్శకమైన, బాధ్యతాయుతమైన, స్పందించే మరియు ప్రజా కేంద్రిత సేవలను అందించడమే మండల స్థాయి ప్రజావాణి ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని MPDO తాళ్లూరి రవి కోరారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :