Wednesday, 16 September 2026 01:57:38 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

రెండు వారాలు శ్రమించి గొంతు కోసుకున్న వ్యక్తికి పునర్జన్మ ఇచ్చిన భద్రాద్రి టీవీవీపీ వైద్యులు. అభినందించిన జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్.

Date : 22 December 2025 08:45 PM Views : 301

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : - వైద్య బృందాన్ని ప్రత్యేకంగా అభినందించిన జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ,MLA తెల్లం వెంకట్రావు. ⁠ఇటువంటి ఆపరేషన్ చేయాలంటే గట్స్ ఉండాలన్న ఎంఎల్ ఏ తెల్లం వెంకటరావు - ⁠చెమర్చిన కళ్ళతో డా రవి బాబు, ఇతర వైద్యులకు కృతజ్ఞతలు తెలిపిన రోగి, రోగి భార్య రెండు వారాల క్రితం కొత్తగూడెం లో బస్టాండ్ దగ్గర నూడిల్స్ బండి నడిపే పశ్చిమ బెంగాల్ వ్యక్తి బిశాల్ తమంగ్ వ్యక్తిగత కారణాల దృష్ట్యా గొంతుకోసుకోని ఆత్మహత్య యత్నం చేయగా , లోతుగా గొంతు తెగడం తో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు .మార్గమధ్యలో కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం అందుకున్న డాక్టర్ రవి బాబు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేశారు.ఆశలు వదులుకున్న తరుణం లో స్వతహాగా గొంతు స్పెషలిస్ట్ అయిన డా రవి బాబు , పాల్వంచ ఆసుపత్రి సిబ్బంది తో కలిసి రెండు గంటలు శ్రమించి పాల్వంచ ఆసుపత్రి లో ఆపరేషన్ చేసి అబ్సర్వేషన్ కోసం భద్రాచలం ఐసీయూ కి తరలించారు. రెండు వారాలు పాటు కంటికి రెప్పలా కాపాడుకుంటూ చికిత్స అందించినా భద్రాచలం ఐసీయూ సిబ్బంది నేడు డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా భద్రాచలం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ , భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని రోగి పరిస్థితి పై మాట్లాడారు. ముందుగా కలెక్టర్ మాట్లాడుతూ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో జరగ వలసిన ఆపరేషన్ ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో సాహసోపేతంగా గోల్డెన్ హౌర్ లో ఆపరేషన్ చేసి ప్రాణాలు నిలిపిన డాక్టర్ రవి బాబు, పాల్వంచ ఆసుపత్రి బృందాన్ని అభినందించారు. అలాగే ఎంతో ఓపికతో ఇరవై నాలుగు గంటలు రోగికి చికిత్స చేస్తూ కోలుకోవడం లో విశేష కృషి చేసిన భద్రాచలం ఐసీయూ సేవల్ని ఆయన ప్రశంసించారు.ఈ సంఘటన జిల్లాలో బలోపేతమైన ప్రభుత్వ ఆసుపత్రి సేవలకు నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు.రోగికి పునర్జన్మ ఇచ్చిన వైద్యులు దేవుళ్లతో సమానమని, రోగికి పుష్పగుచ్ఛం ఇచ్చి రాముడి ఆశీస్సులతో నిండు నూరేళ్లు జీవించాలని ఆయన ఆకాంక్షించారు.భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట రావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ప్రోత్సాహం తో ప్రభుత్వ వైద్యులు అద్భుతాలు సృష్టిస్తున్నారని, అందుకు నిదర్శనమే రోగి బిషాల్ తమంగ్ కి జరిగిన ఆపరేషన్ అని తెలిపారు. వైద్యులకు మనోధైర్యం ఇస్తే ఏజెన్సీ లో అయినా గొప్ప గొప్ప ఆవిష్కరణ జరుగుతాయని తెలిపారు. ధైర్యం చేసి సాహసోపేతమైన ఆపరేషన్ చేసిన డాక్టర్ రవి బాబు మరియు ఇతర వైద్యులకు వైద్య సిబ్బందిని అభినందించారు.ఆసుపత్రి సిబ్బంది విశేషంగా కృషి చేసి కొన ఊపిరితో ఉన్న వ్యక్తికి ప్రాణం పోయడం పట్ల జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి . ఏజెన్సీ జిల్లాలో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించిన డాక్టర్ రవి బాబు, డా రామ్ ప్రసాద్, డా సోమరాజు దొర,డా ప్రసాద్, డా రామ కృష్ణ , డా మల్లేష్ , డా నిఖిత , డా కౌండిన్య, డా తేజస్వి ఇతర వైద్య సిబ్బంది ని జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్, ,భద్రాచలం శాసన సభ్యులు తెల్లం వెంకట్ రావు,పలువురు జిల్లా ప్రముఖులు, ప్రజలు అభినందనలు తెలిపారు.క్లిష్ట సమయం లో ముందుకొచ్చి ఆపరేషన్ చేసి తన ప్రాణాలు కాపాడి తనకి పునర్జన్మ ఇచ్చిన డాక్టర్ రవి బాబు, ఇతర ప్రభుత్వ వైద్యులు,వైద్య సిబ్బంది కి రోగి తమంగ్ శాలువా కప్పి సత్కరించారు. తమంగ్ భార్య చెమర్చిన కళ్ళతో వైద్యులకి కృతజ్ఞతలు తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :