తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పోలీసు సిబ్బంది సంక్షేమానికి మొదటి ప్రాధాన్యతనిస్తామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ తెలిపారు. మంగళవారం చాతకొండలోని 6వ బెటాలియన్‌ను సందర్శించిన ఆయన, సిబ్బంది సౌకర్యార్థం నూతనంగా నిర్మించనున్న మెన్ బ్యారెక్స్ పనులకు భూమి పూజ చేశారు. సిబ్బందికి మౌలిక వసతులు కల్పించడం ద్వారా పోలీసు శాఖ పనితీరు మరింత బలోపేతం అవుతుందని ఎస్పీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ పి.సి.వి. రమణ, అదనపు కమాండెంట్ ఎస్. శ్రీధర్ రాజా, అసిస్టెంట్ కమాండెంట్లు ఎ.వి. రమణయ్య, రామకృష్ణ రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్ఐలు జె. లెనిన్ బాబు, సి.హెచ్.వి. శ్రీనివాసరెడ్డి, జి.వి. రామారావు, బి. జానయ్య, మరియు ఇతర బెటాలియన్ పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ