తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 30వ జాతీయ యువజన ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా స్థాయి ఎంపికలను నవంబర్ 6న కొత్తగూడెం క్లబ్లో నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి అనూష తెలిపారు.15 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువతీయువకులు ఈ ఎంపికలకు అర్హులని ఆమె పేర్కొన్నారు. సామూహిక ప్రదర్శనల విభాగంలో జానపద నృత్యాలు, జానపద గేయాలు, వీధి నాటకం, వ్యక్తిగత ప్రదర్శనల విభాగంలో పోస్టర్ తయారీ, కవిత్వం అంశాల్లో ఎంపికలు నిర్వహిస్తామన్నారు.ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 4వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ