తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వివేకవర్ధిని డిగ్రీ & పీజీ కళాశాల లో NSS ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. స్థానిక లక్ష్మీదేవి పల్లిలోని వివేకవర్ధిని డిగ్రీ& పీజీ కళాశాలలో శనివారం నాడు NSS వివేకవర్ధిని ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరాన్ని జ్ఞానోదయ విద్యాసంస్థల వైస్ చైర్మన్ ప్రణవ్ కృష్ణ ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జి కొప్పుల కనక లక్ష్మీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల వైస్ చైర్మన్ ప్రణవ్ కృష్ణ మాట్లాడుతూ రక్తం సరియైన సమయం రక్తం దొరకక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని సరైన సమయంలో రక్తం దొరికితే విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చు అని రక్త దానం చెయ్యటానికి ఎల్లప్పుడూ యువత సిద్దంగా ఉండాలని సూచించారు. రక్తదానంతో ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వారవుతారని ఈ కార్యక్రమంలో మన కళాశాల విద్యార్థులు ఎల్లప్పుడూ ఇతర కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొనాలని రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను అభినందించారు.గత 15 సంవత్సరాల నుంచి మన కళాశాల లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామని వచ్చే సంవత్సరంలో దీనికి రెట్టింపు NSS వాలంటీర్లు పాల్గొనాలని కోరారు.ఈ శిబిరం లో కళాశాల చైర్మన్ MV చౌదరి, వైస్ చైర్మన్ ప్రణవ్ కృష్ణ, ప్రిన్సిపల్ CH.సతీష్ , కళాశాల డీన్ సాయికృష్ణ,NSS ప్రోగ్రామ్ అధికారి A.మల్లేష్ , అకాడమిక్ డైరెక్టర్ కిరణ్,AO ప్రవీణ్ ,అధ్యాపక బృందం సతీష్,సురేష్ , అరవింద్, దుర్గ ప్రసాద్ మరియు ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ సిబ్బంది మరియు NSS వాలంటీర్లు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ