Monday, 02 November 2026 09:05:50 PM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

కొత్తగూడెం ఐఎంఏ హాలులో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.

Date : 01 October 2026 08:28 PM Views : 205

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఐఎంఏ హాలులో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం.శిక్షణను సద్వినియోగం చేసుకొని లక్ష్యాన్ని సాధించాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీస్ శాఖ మరియు సింగరేణి సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ పోలీస్ ఉద్యోగాల ఉచిత శిక్షణ తరగతులు గురువారం కొత్తగూడెంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్‌లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ హాజరై శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు పలు సూచనలు చేశారు.స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపికైన 200 మంది అభ్యర్థులకు 60 పని దినాల పాటు ఉచిత శిక్షణ అందించనున్నారు. వివిధ అంశాల్లో నైపుణ్యం కలిగిన అధ్యాపకులతో నాణ్యమైన శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ఆర్‌ఐ ఆపరేషన్స్ బి. రవి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు ఉచిత మధ్యాహ్న భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ పట్టుదలతో చదివి, నిరంతరం సాధన చేస్తేనే పోలీస్ ఉద్యోగ లక్ష్యాన్ని సాధించగలరని అభ్యర్థులకు సూచించారు. శిక్షణ తరగతులకు క్రమం తప్పకుండా హాజరై అధ్యాపకులు అందించే సూచనలు, శిక్షణను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.పోటీ పరీక్షల్లో ప్రశ్నలను సరిగ్గా అర్థం చేసుకొని, సమయపాలనతో సమాధానాలు రాసే విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ప్రతి అభ్యర్థి తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకొని, క్రమశిక్షణతో చదువుతూ, నిరంతరం సాధన చేయాలని అన్నారు. సరైన ప్రణాళిక, సమయపాలన, కష్టపడి చదవడం, పట్టుదలతో ముందుకు సాగితే ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలను సాధించవచ్చని ఎస్పీ తెలిపారు. పోలీస్ శాఖ మరియు సింగరేణి సంస్థ సంయుక్తంగా కల్పిస్తున్న ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని అభ్యర్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని తమ లక్ష్యాలను సాధించాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, సింగరేణి వెల్ఫేర్ డీజీఎం సునీల్ కుమార్, ఆర్‌ఐ ఆపరేషన్స్ బి. రవి, అధ్యాపక బృందం, పోలీస్ అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :