Monday, 02 November 2026 09:57:23 PM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

గోదావరి పుష్కరాల ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 13 October 2026 04:39 PM Views : 181

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆలయ అభివృద్ధి, పుష్కర ఘాట్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి వైకుంఠధామానికి ప్రత్యామ్నాయ రహదారి, ప్రహరీ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి ఐటీసీ నుంచి భద్రాచలం బ్రిడ్జి వరకు రహదారి సుందరీకరణకు వారం రోజుల్లో ప్రణాళిక సిద్ధం చేయాలి గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులు, పుష్కర ఘాట్ల నిర్మాణం, భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీర్లతో కలిసి వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. ముందుగా శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి చేరుకున్న కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకోగా, అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. దర్శనానంతరం ఆలయ ఉత్తర ద్వారం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్, ఆలయ ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో చేపట్టిన నిర్మాణాల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్లాబ్ నిర్మాణం, రక్షణ గోడలు, మట్టి నింపే పనులు తదితర నిర్మాణాలను పరిశీలించి, నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఆలయం నుంచి గోదావరి స్నాన ఘాట్లకు వెళ్లే రహదారిని పరిశీలించిన కలెక్టర్, భక్తుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా రహదారిని విస్తరించాలని ఆదేశించారు. ప్రస్తుతం సుమారు 25 అడుగుల వెడల్పు ఉన్న రహదారిని మరో ఐదు అడుగులు విస్తరించి 30 అడుగులకు పెంచే ప్రతిపాదనపై చర్చించారు. రహదారికి ఇరువైపులా ఉన్న నిర్మాణాలు, మెట్లు, ఇతర అడ్డంకులను పరిశీలించి అవసరమైన చోట్ల మార్కింగ్ చేయాలని సూచించారు. భూమికి సంబంధించిన అంశాలు, అనుమతులు, నిధులు, బిల్లుల పరిష్కారంలో రోడ్లు భవనాలు, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ , గత మార్చి నెలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన అనంతరం ఇరిగేషన్, దేవాదాయ, రోడ్లు భవనాల శాఖల ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి, పుష్కరాల ఏర్పాట్ల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆలయ ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో చేపట్టిన పనులను వేగవంతం చేసి ముక్కోటి ఏకాదశి, శ్రీరామనవమి, గోదావరి పుష్కరాల గడువులోగా పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం సుమారు 200 మంది కార్మికులతో పాటు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు లైటింగ్ సౌకర్యంతో పనులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. గోదావరి పుష్కరాల కోసం ఉత్తర, దక్షిణ వైపులా మంజూరైన 270 మీటర్లు, 230 మీటర్ల పొడవైన ఘాట్ల నిర్మాణాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. భద్రాచలం ప్రధాన పుష్కర క్షేత్రంగా ఉన్నందున భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కిన్నెరసాని పరిసరాలు, అశ్వాపురం, దుమ్ముగూడెం, పర్ణశాల తదితర ప్రాంతాల్లోనూ అవసరమైన సౌకర్యాలు కల్పించే అంశాన్ని ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు తెలిపారు. భక్తుల వసతి కోసం డార్మిటరీ హాల్ నిర్మాణంతో పాటు గోశాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు . ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట దేవస్థానం ఈవో దామోదర్ రావు, ఆర్ అండ్ బి ఈ ఈ నాగేశ్వరరావు, ఇంజనీరింగ్ శాఖ అధికారులు, తహసిల్దార్ రవికుమార్ ఇన్చార్జి ఎంపీడీవో జిపిఈఓ శ్రీనివాస్ దేవస్థానం డి ఈ రవీందర్రావు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :