Monday, 02 November 2026 09:05:52 PM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

సింగరేణికి రావాల్సిన రూ.59 వేల కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలి

Date : 13 October 2026 06:03 PM Views : 417

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ నెలాఖరులోగా బకాయిలపై నిర్ణయం తీసుకోకుంటే జెన్‌కో, ట్రాన్స్‌కోకు బొగ్గు సరఫరా నిలిపివేత దిశగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్. సింగరేణి కాలరీస్‌ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన సుమారు రూ.59 వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘చలో హైదరాబాద్‌’ కార్యక్రమం విజయవంతమైంది. సింగరేణి పరిధిలోని 12 డివిజన్ల నుంచి సుమారు 1,450 మంది కార్మికులు, యూనియన్‌ నాయకులు హైదరాబాద్‌కు తరలివచ్చి విద్యుత్‌ సౌధ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా యూనియన్‌ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌, ఏఐటీయూసీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ యూసఫ్‌, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి నరసింహ మాట్లాడుతూ సింగరేణికి రావాల్సిన బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు సుమారు రూ.26 వేల కోట్లుగా ఉండగా, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అవి సుమారు రూ.59 వేల కోట్లకు చేరాయని యూనియన్‌ నాయకులు పేర్కొన్నారు. గతంలో బకాయిలపై విమర్శలు చేసిన కాంగ్రెస్‌ నాయకులు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పరిష్కరించడంలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారు.ప్రభుత్వాలు మారుతున్నా సింగరేణి ఆర్థిక సమస్యలు, కార్మికుల ఇబ్బందులు కొనసాగుతుండటం ఆందోళనకరమని వారు అన్నారు. సింగరేణికి రావాల్సిన బకాయిలను చెల్లించడం ప్రభుత్వ దయాదాక్షిణ్యం కాదని, అది ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోవడం సంస్థ ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం చూపడమే కాకుండా, కార్మికులకు అందాల్సిన ప్రయోజనాల చెల్లింపులకు కూడా ఆటంకం కలిగించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బకాయిల చెల్లింపునకు స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.హైదరాబాద్‌లో నిర్వహించిన విద్యుత్‌ సౌధ ముట్టడి రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరిక అని నాయకులు పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా సింగరేణికి రావాల్సిన బకాయిల చెల్లింపుపై సానుకూల నిర్ణయం తీసుకోకుంటే తదుపరి కార్యాచరణను ప్రకటించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.అవసరమైతే జెన్‌కో, ట్రాన్స్‌కోకు బొగ్గు సరఫరా నిలిపివేత దిశగా పోరాటాన్ని తీసుకెళ్తామని స్పష్టం చేశారు. విద్యుత్‌ ఉత్పత్తికి బొగ్గు ఎంత అవసరమో, బొగ్గును ఉత్పత్తి చేసే సింగరేణి సంస్థ ఆర్థిక స్థిరత్వం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు.12 డివిజన్ల నుంచి సుమారు 1,450 మంది కార్మికులు, నాయకులు తరలివచ్చి ముట్టడి కార్యక్రమంలో పాల్గొనడం యూనియన్‌పై కార్మికులకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్‌కుమార్‌ అన్నారు. కార్మికుల న్యాయమైన హక్కులను సాధించే వరకు ఏఐటీయూసీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అడిషనల్‌ జనరల్‌ సెక్రటరీ మిర్యాల రంగయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు ముస్కే సమ్మయ్య, మడ్డి ఎల్లయ్య, సెంట్రల్‌ సెక్రటరీ వంగ వెంకట్‌, బ్రాంచ్‌ కార్యదర్శులు ఎస్.వి.రమణమూర్తి,జక్కుల గట్టయ్య ,సముద్రాల సుధాకర్,బాజీ సైదా, మోట పలుకుల రమేష్‌, ఎమ్మార్సీ రెడ్డి, రాంగోపాల్‌, శైలేంద్ర సత్యనారాయణ, దాగం మల్లేష్‌, సుధాకర్‌, నజీర్‌, రంగు శ్రీనివాస్‌,గంధం సాంబశివరావుతో పాటు అన్ని ఏరియాల కార్యవర్గ సభ్యులు, వివిధ కమిటీల నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :