తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈనెల 17,18 తేదీలు హైదరాబాదులోనీ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో కేలో ఇండియా యూత్ గేమ్స్ రెజ్లింగ్ రాష్ట్ర జట్టు శిక్షణ శిబిరానికి ఎంపిక చేసేందుకు నిర్వహించిన పోటీలలో 57 కేజీల విభాగంలో సత్తా చాటి ఎంపికైన జూలూరుపాడు మండలానికి చెందిన రెజ్లింగ్ క్రీడాకారిణి జి .హారికను వైరా శాసనసభ్యులు రామదాసు నాయక్ ఈరోజు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామదాసు నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర జట్టు శిక్షణలో కూడా ప్రతిభ కనబరిచి కేలో ఇండియా యూత్ గేమ్స్ పోటీలలో పాల్గొని ప్రతిభ కనబరిచి పతకం గెలుపొంది జిల్లా ఖ్యాతిని చాటాలని అందుకు క్రీడాకారీని హారిక కు కావలసిన అన్ని సదుపాయాలు కల్పించి పతకాలు సాధించేందుకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తానని శాసనసభ్యులు రామదాసు నాయక్ తెలిపారు. జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.కాశీ హుస్సేన్ వద్దశిక్షణ పొందుతున్న హారిక గతంలో కూడా పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభ చాటి అనేక పతకాలు బహుమతులు గెలుపొందారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.కాశీ హుస్సేన్,ఉపాధ్యక్షులు గుగులోతు కృష్ణ, అసోసియేషన్ సభ్యులు జి.వెంకట్, కోచ్ లు సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ