Thursday, 05 November 2026 01:58:31 AM
# సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి యువజనోత్సవాల ఎంపిక పోటీలు.క్రీడల అధికారి వి. అనూష. # సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ డిమాండ్ # మురసు తుఫాను పంట నష్టం: రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. # లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను నివారిస్తాం: మేయర్ మూడ్ గణేష్. # ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై సీపీఐ దిగ్భ్రాంతి: రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు # కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు # భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు.

గణేష్ బందోబస్తు విధి నిర్వహణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్సై కున్సోత్ వెంకన్న మృతి

Date : 24 September 2026 12:27 PM Views : 515

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎస్సై కున్సోత్ వెంకన్న మరణం పోలీస్ శాఖకు తీరని లోటు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రగాఢ సంతాపం విధి నిర్వహణలో భాగంగా వినాయక చవితి బందోబస్తు విధులు నిర్వహిస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన కొత్తగూడెం 2 టౌన్ పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ కుంశోత్ వెంకన్న (57) మృతి పట్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ప్రగాఢ సంతాపం తెలిపారు. బుధవారం నాడు తెల్లవారుజామున సుమారు 02:00 గంటల సమయంలో హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో, ట్యాంక్‌బండ్ ప్రాంతంలోని ఎన్టీఆర్ గార్డెన్ మార్గంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో వినాయక చవితి బందోబస్తు విధులు నిర్వహిస్తున్న సమయంలో రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని ద్విచక్ర వాహనదారుడు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ వెంకన్నను ఢీకొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే గాయాల తీవ్రత కారణంగా బుధవారం సాయంత్రం 17:40 గంటలకు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎస్‌ఐ కున్సోత్ వెంకన్న మృతి పోలీస్ శాఖకు తీరని లోటని ఎస్పీ తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన వెంకన్న కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆయన కుటుంబ సభ్యులకు కల్పించాలని, మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.వెంకన్న కుటుంబానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఎస్పీ భరోసా ఇచ్చారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :