తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలలో రెండు సంవత్సరాల కాలపరిమితి గల DMLT మరియు D.Dialysis కోర్సుల (మొత్తం 30+30 సీట్లు) ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈ నెల 13.11.2026 సాయంత్రం 5:00 గంటల వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన Bi.P.C అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత, ఆ తర్వాత M.P.C మరియు ఇతర విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ (https://www.tgpmb.telangana.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, ఆ ఫారానికి సంబంధిత ధృవపత్రాలను జతచేసి కళాశాలలో నేరుగా సమర్పించాలని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ