తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : లక్ష్మీదేవిపల్లిలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి ఉత్సవాలు మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచాయి. ఈ ఉత్సవాల్లో బాల ప్రకృతి ప్రేమికుడు వాక్ ఫర్ ట్రీస్ విశ్వామిత్ర చౌహాన్ పాల్గొని, ముస్లిం సోదరులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిరోజూ మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న చౌహాన్ ను ఈ సందర్భంగా ముస్లిం సోదరులు శాలువాతో ఘనంగా సత్కరించారు. మతాలకు అతీతంగా ప్రకృతిని ప్రేమించాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం చాటి చెప్పింది. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ