Thursday, 05 November 2026 01:58:28 AM
# సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి యువజనోత్సవాల ఎంపిక పోటీలు.క్రీడల అధికారి వి. అనూష. # సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ డిమాండ్ # మురసు తుఫాను పంట నష్టం: రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. # లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను నివారిస్తాం: మేయర్ మూడ్ గణేష్. # ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై సీపీఐ దిగ్భ్రాంతి: రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు # కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు # భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు.

హరిణి హత్య కేసు నిందితులను శిక్షించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

Date : 23 September 2026 05:31 PM Views : 443

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ???? హరిణి హత్య కేసు నిందితులను శిక్షించాలి.బాధిత కుటుంబానికి అండగా ఉంటాం.నిందుతులపట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.నర్సింగ్ విద్యార్థిని హరిణి హత్య కేసులోని నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన హరిణి ఖమ్మంలో నర్సింగ్ చదువుతూ, ఇటీవల లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగులోని బంధువుల ఇంటికి వచ్చి వచ్చిన మరుసటి రోజే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ సమాచారం తెలిసిన వెంటనే కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న ఆయన, మృతదేహాన్ని పరిశీలించి కన్నీరుమున్నీరవుతున్న బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తు ఉన్న ఓ విద్యార్థిని ఇలా దారుణంగా హత్యకు గురికావడం అత్యంత బాధాకరమన్నారు. సమాజంలో మహిళలకు రక్షణ కరువవుతున్న ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు గట్టి నిఘా ఉంచి కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. హరిణి కుటుంబానికి తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, ఉప సర్పంచ్ పాషా తదితరులు వున్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :