తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎస్ఐ మృతి అత్యంత విచారకరం. బాధితుడి కుటుంబానికి అండగా నిలవాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై రామవరం (కొత్తగూడెం టూటౌన్) ఎస్ఐ కునుసోతు వెంకన్న మృతి చెందడం అత్యంత విచారకరమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. గణేష్ నిమజ్జన బందోబస్తు విధుల కోసం హైదరాబాద్ వెళ్లిన ఆయన అక్కడ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. కర్తవ్య నిర్వహణలో అంకితభావంతో పనిచేసే నిబద్ధత కలిగిన అధికారిని కోల్పోవడం బాధాకరమన్నారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తూ, శోకతప్త కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విధి నిర్వహణలో అమరుడైన ఎస్ఐ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, ఆర్థిక సాయంతో పాటు ఆ కుటుంబానికి కొండంత అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ