Monday, 02 November 2026 09:57:24 PM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

హక్కుల సాధనలో ఏఐటీయూసీదే అగ్రస్థానం. ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షులు ఎస్ కే సాబీర్ పాషా.

Date : 05 October 2026 06:39 PM Views : 150

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ???? హక్కుల సాధనలో ఏఐటీయూసీదే అగ్రస్థానం.కార్మిక చట్టాలను కోడ్'లుగా మార్చడం దుర్మార్గం. కాంట్రాక్టు కార్మికులకు దసరా అడ్వాన్సు, లాభాల వాటా చెల్లించాలి. సంఘటిత పోరాటాలతోనే సమస్యల పరిష్కారం.ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షులు ఎస్ కే సాబీర్ పాషా.కార్మిక హక్కుల పరిరక్షణ, సమస్యల సాధనలో ఏఐటీయూసీ ఎల్లప్పుడూ అగ్రస్థానంలో నిలుస్తుందని ఆ సంఘ జిల్లా గౌరవాధ్యక్షులు ఎస్ కే సాబీర్ పాషా స్పష్టం చేశారు. సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలోని సివిల్ విభాగం రైటర్ బస్తీకి చెందిన కాంట్రాక్ట్ కార్మికులు సోమవారం ఏఐటీయూసీలో చేరారు. ఈ సందర్భంగా కార్మికులకు ఎర్ర కండువాలు కప్పి యూనియన్ లోకి సాదరంగా ఆహ్వానించిన అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను బడా పెట్టుబడిదారులకు తాకట్టు పెడుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ అదానీ, అంబానీ లాంటి కుబేరులకు అనుకూలంగా లేబర్ కోడ్ లుగా మార్పు చేయడం దుర్మార్గమన్నారు. సింగరేణి సంస్థ అభివృద్ధిలో పర్మనెంటు కార్మికులతో సమానంగా శ్రమిస్తున్న కాంట్రాక్టు కార్మికుల శ్రమను గుర్తించాలని, వారికి రాబోయే దీపావళి లాభాల బోనస్ (పీఎల్ఆర్) పెంచి చెల్లించడంతోపాటు పర్మనెంటు కార్మికులకు చెల్లిస్తున్నట్లుగా దసరా అడ్వాన్సు చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతనాల పెంపుదల, ఉద్యోగ భద్రత కోసం వర్గ పోరాటాలు నిర్మించాల్సిన అవసరం ఉందని, కాంట్రాక్టు కార్మికులు సంఘటితంగా ఐక్యంగా పోరాడినప్పుడే న్యాయమైన సమస్యలు పరిష్కారం అవుతాయని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్ వి రమణమూర్తి, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య, ఉపాధ్యక్షులు కిష్టాఫర్, నాయకులు బంగారు లక్ష్మణ్, వి.నాగలక్ష్మి, శ్రీనివాస్, సుధాకర్, జె.భాగ్యలక్ష్మి, ఎం.శాంత, రమణ, సారమ్మ, అనంతలక్ష్మి, రమేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :