తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు, రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి అవసరమైన కార్యాచరణలో భాగంగా ABVP కార్యాలయం నందు ఉచిత ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటరు ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పట్టభద్రులకు ఉచితంగా ఆన్‌లైన్ ద్వారా ఓటరు నమోదు చేయించడం జరిగింది. అర్హులైన ప్రతి పట్టభద్రుడు తమ ఓటు హక్కును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని నాయకులు సూచించారు. అదేవిధంగా రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులకు అవగాహన కల్పిస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు.కొత్తగూడెం పట్టణంలో ప్రతి అర్హుడైన పట్టభద్రుడిని చేరుకోవడం, ప్రతి ఒక్కరి ఓటు నమోదు చేయించడం, బూత్ స్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం లక్ష్యంగా బీజేపీ పట్టణ నాయకత్వం కార్యాచరణ చేపడుతోంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఆదిమూల రాములు, కనుకుంట్ల రాజమొగిలి, రాయుడు నాగేశ్వరరావు, పట్టణ నాయకులు భాస్కర్ గౌడ్, గిరి, రవి, చంద్రగిరి రమేష్ మరియు మహిళ నాయకురాలు భూక్యా పూర్ణ, యామిని, సుహాసిని తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ