Tuesday, 03 November 2026 12:52:09 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

రూ.1.82 కోట్ల గంజాయి పట్టివేత. 365 కేజీల గంజాయి స్వాధీనం. లారీ కారు బైక్ స్వాధీనం. ఇద్దరు వ్యక్తుల అరెస్ట్.

Date : 30 September 2026 07:38 PM Views : 502

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రూ.1.82 కోట్ల గంజాయి పట్టివేత..365 కేజీల గంజాయి స్వాధీనం.లారీ కారు బైక్ స్వాధీనం.ఇద్దరు వ్యక్తుల అరెస్ట్.ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు మూడు వాహనాల్లో తరలి వెళ్తున్న గంజాయిని ఖమ్మం జిల్లా భద్రాచలం డిటిఎఫ్ ఇతర ఎక్సైజ్ టీములు కలిసి పట్టుకున్నారు.ఈ మూడు వాహనాల్లో 365 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.పట్టుకున్న గంజాయి విలువ రూ. 1.82 కోట్లుగా ఉంటుందని ఖమ్మం జిల్లా డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు.కేసు వివరాల్లోకి వెళితే..భద్రాచలం వీరభద్ర ఫంక్షన్ హాల్ సమీపంలో డిటిఎఫ్ కొత్తగూడెం టీం తనిఖీలు నిర్వహించారు.ఈ తన్కీలో తొలతగా బైక్ పై వస్తున్న వ్యక్తి వద్ద తొమ్మిది కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా కు చెందిన దివాకర్ మండల్(22) అనే వ్యక్తి వద్ద 9 కిలాల గంజాయితో పాటు బైకును సీజ్ చేశారు. బైక్ వెనక వస్తున్నటువంటి హుందాయి కార్ పై అనుమానం వచ్చి ఎక్సైజ్ టీములు తనిఖీలు నిర్వహించగా కారులో 100 కేజీల గంజాయి లభ్యమైంది.ఈ కేసులో ఎలక్ట్రిషన్ గా పనిచేసే అటువంటి ఒరిస్సాకు చెందిన సుమన్ పాల్ (22) అదుపులోకి తీసుకున్నారు.కారు బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను విచారించగా మరో లారీలో కూడా గంజాయి ఉన్నట్లు నిందితులు ఇచ్చిన సమాచారం.రుణ కరుణగిరి వద్ద ఆగి ఉన్నటువంటి లారీని తనిఖీలు చేయగా 263.2 కేజీల గంజాయి పట్టుబడింది.లారీ లో ఉన్న రాజశేఖర్ మార్గి (22), లారీ లో ఉన్న క్లీనర్ బ్రిజన్ నాసా(20) ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు వీరిద్దరు కూడా ఒరిస్సాకు చెందిన వ్యక్తులుగానే గుర్తించారు లారీ కూడా ఒరిస్సా ప్రాంతానికి చెందినదిగా ఉంది.కొత్తగూడెం డిటిహెచ్ సిఐ రమాదేవి మరో సిఐ కిష్టయ్య, నరేందర్ రెడ్డి తో పాటు ఎస్ఐ సలీముల్లా ఖాన్ శ్రీధర్ రావులతో కలిపి సిబ్బందికరీం, మౌలాంకర్, వీరబాబు, శ్రీనివాస్, నర్సింహరావు, రమేష్, పార్థసారధి, విల్సన్, సీతారాం, వీరభద్రం, రాకేష్, కిరణ్, ప్రసన్న కుమార్ ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు.గంజాయిని పట్టుకున్నటువంటి ఖమ్మం టీంలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అవినాష్ మహంతి, ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ అంజన్ రావు,ఖమ్మం డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి అభినందించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :