Monday, 02 November 2026 09:57:20 PM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

ప్రధాని నరేంద్ర మోదీ తండ్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం – బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి.

Date : 27 October 2026 08:29 PM Views : 240

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా ముర్రేడు బ్రిడ్జి వద్ద బీజేపీ రాస్తారోకో.ప్రధాని నరేంద్ర మోదీ తండ్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం – బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు లక్ష్మీదేవిపల్లి మండలంలోని ముర్రేడు బ్రిడ్జి వద్ద కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన కార్యక్రమం, రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తండ్రిపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అనుచిత వ్యాఖ్యలు చేయడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. జాతీయ స్థాయి బాధ్యతల్లో ఉన్న నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగడం సరైన పద్ధతి కాదని, ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.భారతీయ జనతా పార్టీ పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు ప్రజల మద్దతుతో విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతుండటాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక తీవ్ర అసహనానికి గురవుతోందని విమర్శించారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ, తన రాజకీయ వైఖరిలో మార్పు తెచ్చుకోకపోతే ప్రస్తుతం అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లోనూ రాబోయే రోజుల్లో ప్రజల తిరస్కరణను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.ప్రధాని నరేంద్ర మోదీపై లేదా ఆయన కుటుంబ సభ్యులపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఇలాంటి వ్యాఖ్యలను పునరావృతం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి ప్రజాస్వామ్య పద్ధతుల్లో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలు ముర్రేడు బ్రిడ్జి వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జాటోత్ వెంకన్న నాయక్, జిల్లా ఉపాధ్యక్షురాలు భూక్య దివ్యశ్రీ, జిల్లా కార్యదర్శి పుణ్య నాయక్, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు జుజ్జూరు మోహన్ కృష్ణ, లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు నవీన్, చంద్రుగొండ మండల అధ్యక్షులు రఘుపతి, ములకలపల్లి మండల అధ్యక్షులు శంకర్, టేకులపల్లి మండల అధ్యక్షులు శంభు నాయక్, పాల్వంచ టౌన్ అధ్యక్షులు రాపాక రమేష్, ఎస్టీ మోర్చా అధ్యక్షురాలు భూక్య స్వాతి, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు బడే, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి మువ్వ అపర్ణ, యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కోల హరీష్, సీనియర్ నాయకులు పైడిపాటి రవీందర్, పొనగంటి రాజు, సతీష్, మహంకాళి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :