తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పదునైన వస్తువుతో దాడికి గురైన వ్యక్తికి GGHలో విజయవంతంగా అత్యవసర శస్త్రచికిత్స.ముఖం, మెడ, చెవి వద్ద తీవ్ర గాయాలకు సకాలంలో వైద్య సేవలు. కొత్తగూడెం ప్రభుత్వ సర్వజన వైద్యశాల (GGH)లో పదునైన వస్తువుతో దాడికి గురైన 45 సంవత్సరాల వ్యక్తికి వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించి ప్రాణాపాయం నుంచి కాపాడారు.శనివారం రాత్రి 11:30 గంటలకు తీవ్ర గాయాలతో క్యాజువాలిటీకి వచ్చిన రోగికి ముఖం, మెడ, కుడి చెవి ప్రాంతాల్లో లోతైన గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే అత్యవసర వైద్య సేవలు ప్రారంభించి, సీనియర్ రెసిడెంట్ డా. ఫరూక్ స్టాఫ్ నర్సుల సహకారంతో లోకల్ అనస్తీషియా కింద గాయాలకు కుట్లు వేయడంతో పాటు కుడి చెవికి రిపేర్ చేశారు. డా. రమేష్, అనస్థీషియా విభాగం, శస్త్రచికిత్సతో పాటు శస్త్రచికిత్స అనంతర క్రిటికల్ కేర్ మేనేజ్మెంట్లో కీలకంగా పాల్గొన్నారు.చీఫ్ సర్జన్, జనరల్ సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. రాంప్రకాష్ చిటిమళ్ల పర్యవేక్షణలో వైద్య బృందం సమన్వయంతో అత్యవసర చికిత్స అందించింది. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన వైద్యులు, అనస్థీషియా విభాగం, నర్సింగ్ సిబ్బంది, ఇతర సిబ్బందిని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రాధామోహన్ అభినందించారు.అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి క్లిష్టతరమైన శస్త్రచికిత్సలు, క్రిటికల్ కేర్ మేనేజ్మెంట్ సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన వైద్య వసతులు, సేవలను బలోపేతం చేయడంలో సహకరిస్తున్న జిల్లా కలెక్టర్ అంకిత్‌కు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, కొత్తగూడెం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ