Tuesday, 03 November 2026 12:12:43 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

బైక్ దొంగతనం కేసును ఛేదించిన టాస్క్ ఫోర్స్, లక్ష్మీదేవిపల్లి పోలీసులు. నిందితుడి అరెస్ట్, హోండా యూనికార్న్ మోటార్‌సైకిల్ స్వాధీనం.

Date : 12 October 2026 10:35 AM Views : 294

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బైక్ దొంగతనం కేసును ఛేదించిన టాస్క్ ఫోర్స్, లక్ష్మీదేవిపల్లి పోలీసులు.నిందితుడి అరెస్ట్.. హోండా యూనికార్న్ మోటార్‌సైకిల్ స్వాధీనం.చెడు వ్యసనాలకు అలవాటుపడి, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మోటార్‌సైకిల్ దొంగతనానికి పాల్పడిన ఒక నిందితుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు, లక్ష్మీదేవిపల్లి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి దొంగిలించిన హోండా యూనికార్న్ మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైం నంబర్ 174/2026 కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు చేపట్టిన చర్యల్లో జయశంకర్ కాలనీకి చెందిన తాటి బుజ్జిబాబు (33) నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు.పోలీసుల విచారణలో నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో కాపర్ దొంగతనం, బైక్ దొంగతనం కేసులతో పాటు హత్య కేసులోనూ అతనిపై కేసులు నమోదయ్యాయి. జైలు నుంచి విడుదలైన అనంతరం కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నప్పటికీ, వచ్చిన ఆదాయం కుటుంబ పోషణకు, తన వ్యసనాలకు సరిపోవడం లేదనే కారణంతో సులభంగా డబ్బు సంపాదించాలని దొంగతనానికి పథకం వేశాడు.ఈ క్రమంలో 03.08.2026న మధ్యాహ్నం నుంచి సాయంత్రం మధ్య లక్ష్మీదేవిపల్లిలోని బావర్చి సెంటర్ సమీపంలో ఉన్న బిల్లా పాన్ షాప్ వద్ద నంబర్ ప్లేట్ లేని హోండా యూనికార్న్ మోటార్‌సైకిల్‌ను గుర్తించాడు. బైక్ యజమానితో పరిచయం పెంచుకుని, అతనికి మద్యం తాగించి, మద్యం మత్తులో ఉన్న సమయంలో బైక్ తాళం తీసుకుని మోటార్‌సైకిల్‌తో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.మోటార్‌సైకిల్‌ను విక్రయించి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో 10.10.2026న బయటకు తీసుకువెళ్తుండగా పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించడం గమనించి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడిని పట్టుకుని విచారించగా, మోటార్‌సైకిల్ దొంగతనానికి పాల్పడినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.నిందితుడిని అరెస్ట్ చేసి, దొంగిలించిన హోండా యూనికార్న్ మోటార్‌సైకిల్‌ను లక్ష్మీదేవిపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.వాహనాలు, ఇతర ఆస్తుల దొంగతనాలకు సంబంధించిన అనుమానాస్పద ఘటనలు గమనించినా, తమ ఆస్తులు చోరీకి గురైనా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.ఈ కేసును ఛేదించడంలో సమన్వయంతో పనిచేసిన టాస్క్ ఫోర్స్, లక్ష్మీదేవిపల్లి పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :