Tuesday, 03 November 2026 11:34:01 PM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

యుద్ధ ప్రాతిపదికన మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీలను అరికట్టాలి : మునిగడప పద్మ

Date : 25 October 2026 01:59 PM Views : 309

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎల్ ని నో అవగాహనలో ప్రభుత్వం నుండి ప్రజల వరకు మారాలి.. పైప్లైన్ ఇన్ని లీకేజీలు ఉంటే ప్రజలకు మనం ఏమి అవగాహన కల్పిస్తాం : 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ యుద్ధ ప్రాతిపదికన మిషన్ భగీర పైప్ లైన్ లీకేజీ లను అరికట్టాలని 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం మిషన్ భగీరథ నీటి సరఫరా అవుతున్న సమయంలో రామవరం మెయిన్ బజార్, చాపల మార్కెట్ ఏరియా, నెహ్రూ బస్తి తదితర ప్రాంతాలను సందర్శించి ఆమె మాట్లాడుతూ ఒకవైపు ముంచుకొస్తున్న ఎల్ ని నో ప్రభావం ద్వారా నీటి వనరుల కొరత పై సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి, ప్రభుత్వం ప్రకటనలను ఇస్తున్నప్పటికీ మరొకవైపు ప్రభుత్వ అధికారులు, మిషన్ భగీరథ నిర్వాహకులు పైప్ లైన్ లీకేజీలను అరికట్టడంలో జాప్యం చేయటం తగదని అన్నారు. ఇలా అయితే మనం ప్రజలకు ఎల్ ని నో ప్రభావం ద్వారా నీటి కొరత ఏర్పడిందని,నీటి కొరతపై ప్రజలు అవగాహన పెంచుకొని నీటిని వృధా కాకుండా చూడాలని ఎలా వారికి చెప్తామని ఆమె అన్నారు. తక్షణమే మున్సిపల్, మిషన్ భగీరథ అధికారులు సమన్వయం చేసుకొని ఎక్కడెక్కడ లీకేజీల వల్ల మంచినీళ్లు వృధా అవుతున్నాయో ఆయా ప్రాంతాలలో తక్షణమే లీకేజీలను అరికట్టాలని మరొక్కసారి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు, కిన్నెరసాని లైన్ ఇన్స్పెక్టర్ నిఖిల్ పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :