తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భక్తిభావం సమాజ హితానికి దోహదపడాలి.ఐక్యతతోనే ప్రగతి సాధ్యం. ప్రజలందరికీ గణేశుడి ఆశీస్సులుండాలి.శాంతి, సామరస్యాలతో జీవించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.సమాజంలో శాంతి, సామరస్యాలు వెల్లివిరిసి ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలనే సద్భావనకు గణేష్ నవరాత్రులు నిదర్శనమని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంగళవారం పట్టణంలోని రైటర్ బస్తీ త్రిమాత దేవాలయం, రామవరంలోని వానందాస్ గడ్డ, పోస్ట్ ఆఫీస్ సెంటర్, మేదరబస్తీలోని భగత్ సింగ్ కాలనీల్లో ఉత్సవ కమిటీలు నిర్వహించిన వినాయక మండపాలను ఆయన సందర్శించారు. గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగలు మానవ సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయన్నారు. విజ్ఞేశ్వరుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ప్రాంత సమగ్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కలిసికట్టుగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, కంచర్ల జమలయ్య, భూక్య శ్రీనివాస్, బండి నర్సింహా, కూరపాటి సుధాకర్, యూసఫ్, దినేష్, పండు, మండల రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ