Tuesday, 03 November 2026 09:33:06 PM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 07 October 2026 02:41 PM Views : 116

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పరీక్షల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలి విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలి ములకలపల్లి మండలం మూకమామిడి ఏకలవ్య పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహిస్తున్న పరీక్షలను పరిశీలించిన కలెక్టర్, ప పాఠశాలలోని ప్రతి తరగతి గదిని సందర్శించిన కలెక్టర్, అక్కడ జరుగుతున్న పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. విద్యార్థులు రాస్తున్న పరీక్షలను గమనించి, వారి ప్రశ్నపత్రాలు, ఆన్సర్ షీట్లను పరిశీలించారు. పరీక్షల నిర్వహణలో పాటిస్తున్న విధానం, విద్యార్థుల హాజరు, పరీక్షల సమయంలో తీసుకుంటున్న చర్యలను పరిశీలించి, ప్రధానోపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ రీజియన్ పరిధిలోని ఏకలవ్య పాఠశాలలకు ఒకే ప్రశ్నపత్రాన్ని రూపొందించి పంపిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు కలెక్టర్‌కు వివరించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం పాఠశాలలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. మెడికల్ రూమ్‌లో అందుబాటులో ఉన్న మందులు, విద్యార్థులకు అందించిన చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అవసరమైన మందులు, ప్రాథమిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల కిచెన్ షెడ్‌ను పరిశీలించిన కలెక్టర్, మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారా లేదా అని తనిఖీ చేశారు. వంటకు వినియోగిస్తున్న కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. కూరగాయలను నేలపై ఉంచడాన్ని గమనించిన కలెక్టర్, కూరగాయలను నేలపై ఉంచడం వల్ల పురుగులు, క్రిమికీటకాలు చేరి ఆహారం కలుషితమయ్యే అవకాశం ఉందని తెలిపారు. కూరగాయలను ర్యాకులు, బండలపై సురక్షితంగా నిల్వ చేయాలని ఆదేశించారు. కిచెన్ నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కలెక్టర్, ఆహార పదార్థాల తయారీలో తప్పనిసరిగా పరిశుభ్రత ప్రమాణాలను పాటించాలని సూచించారు. వంటకు వినియోగించే కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను శుభ్రంగా కడిగి, నాణ్యతను పరిశీలించిన అనంతరం మాత్రమే వినియోగించాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన, తాజా కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. వంటశాలను ప్రతిరోజూ శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవడంతో పాటు, వంట సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రతను పాటించేలా చూడాలని సూచించారు. స్టోర్ రూమ్‌ను పరిశీలించిన కలెక్టర్, ఆహార పదార్థాలు, ఇతర సామగ్రిని క్రమబద్ధంగా నిల్వ చేయాలని ఆదేశించారు. ధాన్యాలు, పప్పులు, కూరగాయలు తదితర వస్తువులను నేలపై ఉంచకుండా ర్యాకులు, బండలపై భద్రపరచాలని, అవసరమైన ఆహార పదార్థాలను మూత ఉన్న డబ్బాలు, కంటైనర్లలో నిల్వ చేయాలని సూచించారు. వంటశాల, స్టోర్ రూమ్‌తో పాటు పాఠశాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఈ రోజు మెనూలో భాగంగా విద్యార్థులకు తయారు చేస్తున్న చికెన్ కూర నాణ్యతను కూడా కలెక్టర్ పరిశీలించారు. చికెన్ ఎంత పరిమాణంలో వినియోగిస్తున్నారని, ఒక్కో విద్యార్థికి ఎంత పరిమాణంలో అందిస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం 80 కిలోల చికెన్‌ను వంటకు వినియోగిస్తున్నామని, ఒక్కో విద్యార్థికి సుమారు 120 గ్రాముల చొప్పున అందిస్తున్నామని సిబ్బంది కలెక్టర్‌కు తెలిపారు. వంట అనంతరం భోజన నాణ్యతను పరిశీలించి, విద్యార్థులకు సమయానికి, నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు, ఆరోగ్యకరమైన ఆహారం, అవసరమైన వైద్య సదుపాయాలు అందేలా పాఠశాల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలని, పాఠశాల పరిసరాలు, కిచెన్, స్టోర్ రూమ్‌లను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ములకలపల్లి తాసిల్దార్ స్వాతి బిందు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :