తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శ్రీ అన్నపూర్ణాదేవిగా ప్రత్యేక అలంకారం కొత్తగూడెం కల్చరల్ మధురబస్తీలో రాజేందర్ మెమోరియల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ విజయదుర్గా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా,భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు మంగళవారం అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా ప్రత్యేకంగా అలంకరించి,వేదమంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అన్నపూర్ణాదేవి అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు మధురబస్తీతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.అమ్మవారిని దర్శించుకుని అభిషేకం అనంతరం ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించి,తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సంధర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో సందడిగా మారింది.అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో ఉండాలని నిర్వాహకులు యెర్రా కామేష్ ఆకాంక్షించారు. నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు,భక్తులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.రానున్న రోజుల్లో కూడా వివిధ అలంకరణలు,ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యడారి లక్ష్మణ్,బంటు నరేందర్,లక్కీ,నిఖిల్,జస్వంత్,దాసరి ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ