తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇల్లందు నియోజకవర్గ సమీపంలో కారేపల్లి మండలంలో గల ప్రసిద్ధ కోట మైసమ్మ తల్లి దేవాలయ ఆవరణలో వాక్ ఫర్ ట్రీస్ యజ్ఞం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా జరిగింది.పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిరోజూ మొక్కలు నాటుతున్న ప్రముఖ పర్యావరణవేత్త విశ్వామిత్ర చౌహాన్, ఆలయ ధర్మకర్త పట్టాభి రామారావు మరియు వేద పండితులతో కలిసి ఆలయ ప్రాంగణంలో అరుదైన పెద్ద నేరేడు మొక్కను నాటారు ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఒక నేరేడు కాయ 100 గ్రాములకు పైగా ఉండడం విశేషం.వేద పండితుల మంత్రోచ్చారణలు, ఆశీర్వచనాల మధ్య భక్తిశ్రద్ధలతో మొక్కను నాటి నీరు పోశారు.విశ్వామిత్ర చౌహాన్ నాటిన ఇది 1606వ మొక్క కావడం విశేషం. వాక్ ఫర్ ట్రీస్ యజ్ఞంతో నిత్యం మొక్కలు నాటుతూ పర్యావరణ సేవలో ముందుంటున్నారు.కోట మైసమ్మ తల్లి జాతర నడుస్తున్న వేళ ఆలయానికి వచ్చిన భక్తులు విశ్వామిత్ర చౌహాన్ చేస్తున్న పర్యావరణ సేవలను అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఆలయ ఆవరణలో మొక్కలు నాటడం వల్ల ఆలయానికి మరింత పచ్చదనం, ప్రశాంతత చేకూరుతుందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ