తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డిసెంబర్లో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర మహాసభలు. ఖమ్మంలో నేడు జరిగే సన్నాహక సమావేశానికి తరలిరండి. మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి.తెలంగాణ రాష్ట్ర మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి పిలుపునిచ్చారు. డిసెంబర్ 27, 28, 29 తేదీల్లో ఖమ్మం నగరంలో ఈ రాష్ట్ర మహాసభలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయని ఆమె తెలిపారు. ఈ మహాసభల విజయవంతం కోసం శుక్రవారం ఖమ్మం బైపాస్ రోడ్డులోని వాసిరెడ్డి ఫంక్షన్ హాల్లో మహాసభల ఆహ్వాన సంఘ సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సన్నాహక భేటీకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నలుమూలల నుంచి సుమారు 200 మంది మహిళా సమాఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల మహిళా ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళల సమస్యల పరిష్కారానికి, హక్కుల రక్షణకు ఐక్య పోరాటాలు నిర్మించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాబోయే రాష్ట్ర మహాసభలకు సంబంధించి పక్కా కార్యాచరణను ఈ సమావేశంలో రూపొందించనున్నట్లు వెల్లడించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ