తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి : దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్.పుష్కర ఘాట్ల అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిరంతరం పర్యవేక్షించాలి.గోదావరి పుష్కరాలకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుండి జూమ్ మీటింగ్ ద్వారా గోదావరి నది తీర జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐడీఓసీలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లాల వారీగా గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, అభివృద్ధి పనుల పురోగతిని శైలజ రామయ్యర్ అడిగి తెలుసుకున్నారు. భద్రాచలంలో చేపడుతున్న పుష్కర ఘాట్ల అభివృద్ధి పనులు, శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పునరుద్ధరణ, అభివృద్ధి పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ అంకిత్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పుష్కర ఘాట్ల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు.పుష్కర స్నానానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని శైలజ రామయ్యర్ సూచించారు. పుష్కర ఘాట్ల వద్ద పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య శిబిరాలు, గజ ఈతగాళ్ల ఏర్పాటు, విద్యుత్, రహదారులు, బందోబస్తు తదితర అవసరమైన సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ పుష్కరాల ఏర్పాట్లను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు.వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ అంకిత్ భద్రాచలంలో చేపడుతున్న పుష్కర ఘాట్ల అభివృద్ధి పనులు, శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పునరుద్ధరణ, అభివృద్ధి పనుల పురోగతిని వివరించారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సదుపాయాలు, భద్రత తదితర ఏర్పాట్లపై చేపడుతున్న చర్యలను వివరించారు.పుష్కరాల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పుష్కర ఘాట్ల అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా పనులను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో భద్రాద్రి చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ సునీత, ఇరిగేషన్ ఈ.ఈ సయ్యద్ అహ్మద్ జానీ, పంచాయతీరాజ్ ఈ.ఈ సత్యనారాయణ పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ