తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చుంచుపల్లి మండలం గౌతంపూర్ కాలనీ గ్రామపంచాయతీలో కోతుల బెడద నివారించాలని గ్రామ సభ బహిష్కరణ చేసిన గ్రామ ప్రజలు గ్రామంలో కోతుల బెడదను నివారించడంలో గ్రామ సర్పంచ్ కళ్యాణి, సెక్రటరీ షర్మిల నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ గౌతమ్ పూర్ కాలనీకి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు ప్రతి నెల నిర్వహించే సాధారణ గ్రామసభను బహిష్కరించారు. గ్రామంలో కోతుల సమస్య తీవ్రంగా ఉందని, కోతుల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైన పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు. కోతులను పట్టుకుని గ్రామ ప్రజలకు సమస్య నుంచి విముక్తి కల్పించే వరకు గ్రామసభలకు హాజరుకాబోమని వివిధ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు స్పష్టం చేశారు. అధికారులు ఇకనైనా స్పందించి కోతుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన గ్రామసభలోనే ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేయాల్సిన పరిస్థితి రావడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకుని గ్రామంలో కోతుల బెడదను నివారించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ