Monday, 02 November 2026 06:15:24 PM
# అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # భారత కార్మిక పోరాట దిక్సూచి ఏఐటీయూసీ. 106 ఏళ్ల ఘన చరిత్ర కార్మిక వర్గానికే సొంతం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం సహించేది లేదు: కలెక్టర్ అంకిత్. # భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం.రక్తదానం ప్రాణదానంతో సమానం – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # జీవో నెంబర్ 76 లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలి.జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్.

సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 12 October 2026 05:37 PM Views : 184

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సూపర్ ఎల్‌నినోను సమష్టిగా ఎదుర్కోవాలి: ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. తాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.నీటి లభ్యత ఆధారంగా పంటలు ఎంపిక చేసుకోవాలి. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలి: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.2027 జూన్ వరకు తాగునీటి అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలి. యాసంగి 2026–27 సాగుపై రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్‌లో దిశానిర్దేశం.సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. 2026–27 యాసంగి సాగుపై సోమవారం నిర్వహించిన రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ, సహకార మార్కెటింగ్ చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు రైతులకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. నీటి లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలని, అధిక నీటి అవసరం ఉండే వరి సాగుకు బదులుగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భూగర్భ జలమట్టాలు తగ్గుతున్న నేపథ్యంలో, ఎస్‌ఆర్‌ఎస్‌పీ నుంచి సాగునీటి విడుదల లేని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, 2027 జూన్ వరకు తాగునీటి అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. పశువులకు మేత, నీటి సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులను విస్తృతంగా చేపట్టాలని సూచించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ములకలపల్లి మండలం జగన్నాధపురం రైతు వేదిక నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనతో కలిసి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ, మారుతున్న వాతావరణ పరిస్థితులు, సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గత ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణ అధికారులు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో రైతులను కలిసి పప్పుధాన్యాలు, పెసలు, కందులు, మిరప తదితర పంటల సాగుపై అవగాహన కల్పించారని తెలిపారు. ఈసారి కూడా రైతు వేదికల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకునేలా రైతులకు తగిన సూచనలు అందించాలని అధికారులకు సూచించారు.జిల్లాలో భూగర్భ జలమట్టం సుమారు రెండు మీటర్ల మేర తగ్గిన నేపథ్యంలో తాగునీటి అవసరాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. రాబోయే వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రామాల్లోని పాత తాగునీటి పథకాలు, బోరుబావులు, ఇతర నీటి వనరులను ముందుగానే పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని ఎంపీడీవోలు, ఎంపీవోలను ఆదేశించారు. తాత్కాలిక చర్యలకే పరిమితం కాకుండా 2027 జూన్ వరకు తాగునీటి అవసరాలను అంచనా వేసి, అందుబాటులో ఉన్న నీటి వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు.వీబీ -జి రామ్ జి పథకం కింద ప్రతి గ్రామంలో కనీసం 20కి పైగా పనులను గుర్తించి పనుల జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయానికి ఉపయోగపడే ఫామ్ పాండ్స్‌ నిర్మాణం వంటి పనులను చేపట్టాలని, వాటి ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకోవడంతో పాటు అనుకూల పరిస్థితుల్లో చేపల పెంపకం వంటి అనుబంధ ఉపాధి అవకాశాలను కూడా వినియోగించుకోవచ్చని అన్నారు . పశువులకు తాగునీరు, మేత కొరత ఏర్పడకుండా సంబంధిత శాఖలు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.జిల్లాలో గత రబీ సీజన్‌తో పోలిస్తే ఈసారి వరి సాగు విస్తీర్ణాన్ని సుమారు 50 వేల ఎకరాల మేర తగ్గించినట్లు కలెక్టర్ తెలిపారు. తగ్గించిన విస్తీర్ణంలో మినుములు, పెసలు, వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. అశ్వారావుపేట, దమ్మపేట ప్రాంతాల్లో విస్తృతంగా సాగవుతున్న ఆయిల్ పామ్ పంటను ఇతర అనుకూల మండలాల్లోనూ ప్రోత్సహించాలని, ములకలపల్లి, చండ్రుగొండ తదితర మండలాల్లో నేల స్వభావం, నీటి లభ్యతకు అనుగుణంగా ఆయిల్ పామ్ సాగు అవకాశాలను పరిశీలించి రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు.ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తాగునీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటల సాగు, ఉపాధి హామీ పనులు, పశుసంరక్షణ అంశాల్లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ నీటి లభ్యత, సాగు వ్యయాలు, పంటల ద్వారా లభించే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని తగిన సాగు ప్రణాళిక రూపొందించుకునేలా మార్గనిర్దేశం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సిపిఓ సునీత, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, ఉద్యానవన శాఖ అధికారి కిషోర్, మార్కెటింగ్ అధికారి అలీమ్ ఖాన్, భూగర్భ జలవనరుల శాఖ అధికారి రమేష్, తాసిల్దార్ స్వాతి బిందు, ఎంపీడీవో, ప్రజా ప్రతినిధులు, రైతులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :