తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో వయోవృద్ధుల పట్ల అవగాహన, సంరక్షణ, గౌరవం మరియు సంక్షేమం కొరకు ఈనెల 24 నుండి అక్టోబర్ ఒకటి వరకు జిల్లా లో వివిధ కార్యక్రమాలను చేపట్టవలసినదిగా జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం నేటి నుండి వయోవృద్ధుల సంరక్షణ మరియు సాధికారత వారోత్సవాలు ప్రారంభించబడినదని జిల్లా సంక్షేమాధికారి లెనినా తెలిపారు . ఇందులో భాగంగా జిల్లా రెవిన్యూ అధికారి ఎస్.పద్మావతి వారోత్సవాల పోస్టర్ ని సీనియర్ సిటిజన్స్ తో కలిసి ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ల సంక్షేమం మరియు సాధికారత వారోత్సవాల పై సంబంధిత శాఖల మధ్య సమన్వయం తో జిల్లాలో ఉన్న వృద్ధాశ్రమాల్లో షెడ్యుల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అన్ని పోలీస్ స్టేషన్లలోని గోడలపై ప్రముఖంగా కనిపించేలా వయోవృద్ధుల సంక్షేమ చట్టం గురించి బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. 25/09/2026 PHC, CHC మరియు బస్తీ దవాఖానాల పరిధిలోని సంబంధిత అధికారులందరూ తమ పరిధిలో వృద్ధుల కోసం ఆరోగ్య శిబిరాలను నిర్వహించాలన్నారు.26/09/2026 జిల్లాలోని ఉన్న 6 వృద్ధాశ్రమాలలో కనీస వసతులు, సౌకర్యాల తనిఖీ, రికార్డుల పరిశీలన, సంబంధిత సి.డి.పి.ఓ.లు, సూపర్వైజర్లు నిర్వహించాలి.28/09/2026 సైబర్ మోసాలు, OTP/UPI/బ్యాంకింగ్ భద్రత మరియు డిజిటల్ సేవలు, స్మార్ట్‌ఫోన్‌ల బాధ్యతాయుత వినియోగంపై అవగాహన, 29/09/2026 వయో వృద్ధులను, తాతయ్య-అమ్మమ్మలు/నానమ్మల మధ్య తరాల మధ్య అనుబంధాన్ని పెంపొందించే కార్యక్రమాలను, అన్ని విద్యా సంస్థలలో నిర్వహించాలి. 30/09/2026 వయో వృద్ధుల కోసం యోగా, ప్రాణాయామం ప్రదర్శన మరియు శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు, 'వాకథాన్' ర్యాలీ, ప్రతిజ్ఞ కార్యక్రమాలు,01/10/2026 జిల్లా స్థాయి 'అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ' వేడుకలు, ఇందులో వయోవృద్ధులను, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులను సన్మానించడం వంటి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో శంభు ప్రసాద్, అడిషనల్ డైరెక్టర్ జిల్లా విద్యాశాఖ, ఎర్రమళ్ళ శ్రీనివాసరావు ఉద్యోగ సంఘాల నేత, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులు సందీప్, పి.ఎస్.ఎన్.రెడ్డి, జయరాం, వెంకటేశ్వర్లు, బుచ్చయ్య, నాగేశ్వరరావు, సురేష్, అబ్రహం, లక్ష్మయ్య, రామ స్వామి, కార్యాలయ సిబ్బంది వర ప్రసాద్, నరేష్ మరియు సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ