Monday, 02 November 2026 07:00:22 PM
# పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

మద్దతు ధరల పేరిట రైతులకు మోసం : ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు భాగం హేమంతరావు

Date : 07 October 2026 05:27 PM Views : 115

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సీతారామ సాగు జలాలు ఈ జిల్లా రైతుల హక్కు. కరువు పరిస్థితుల్లో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి. రైతు సమస్యలపై పోరాటాలు ఉధృతం చేస్తాం. ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు భాగం హేమంతరావు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, మద్దతు ధరల పేరిట రైతాంగాన్ని నిలువునా మోసం చేస్తున్నారని ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు భాగం హేమంతరావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకేఎస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విస్తృత కౌన్సిల్ సమావేశం బుధవారం పాల్వంచలోని సి.ఆర్. భవన్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాల వల్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీతారామ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంత రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ప్రాజెక్టు ద్వారా స్థానిక ఆయకట్టుకు రావాల్సిన సాగునీటి హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పంట నష్టపోయిన అన్నదాతలకు తక్షణమే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి రైతుకూ ఎలాంటి కోతలు లేకుండా రైతు భరోసా సాయాన్ని విడుదల చేయడంతో పాటు చివరి ఆయకట్టు వరకు సీతారామ ప్రాజెక్టు ద్వారా నిరంతర సాగునీరు అందించాలని కోరారు. పాలకుల నిర్లక్ష్య వైఖరిపై రాజీలేని పోరాటాలు సాగించాల్సిన బాధ్యత మనపై ఉందని, రైతు హక్కుల సాధనకు గ్రామస్థాయిలో సంఘాన్ని బలోపేతం చేసి ఐక్య ఉద్యమాలను ఉధృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వర్లు, చండ్ర నరేంద్ర కుమార్, తాటి వెంకటేశ్వర్లు, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, వాడే లక్ష్మి, ys గిరి, కుమారి హనుమంతరావు, నరాటి రమేష్, చర్ప నాగేశ్వరరావు, కమటం సురేష్, కొంగర అప్పారావు, రంజిత్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :