తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మధు యాష్కీ గౌడ్ ను సన్మానించిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.ఏఐపీసీ చైర్మన్‌గా నియామకంపై హర్షం వ్యక్తం.ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రొఫెషనల్స్ కమిటీ (ఏఐపీసీ) చైర్మన్‌గా నియమితులైన మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్‌ను టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఆయన స్వగృహంలో మధు యాష్కీ గౌడ్‌ను శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాగా సీతారాములు యాదవ్ మాట్లాడుతూ.. నిజామాబాద్ ఎంపీగా మధు యాష్కీ గౌడ్ అందించిన సేవలు, విదేశాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చేసిన కృషి అభినందనీయమన్నారు. ప్రస్తుతం ఏఐపీసీ చైర్మన్‌గా ఆయనకు బాధ్యతలు అప్పగించడం తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు గర్వకారణమని పేర్కొన్నారు.మధు యాష్కీ గౌడ్ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ప్రొఫెషనల్స్, విద్యావంతులను కాంగ్రెస్ పార్టీతో అనుసంధానం చేసేందుకు మరింత కృషి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం ఆయనపై ఉంచిన నమ్మకానికి ఈ నియామకం నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా మధు యాష్కీ గౌడ్‌కు మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ