Tuesday, 03 November 2026 12:12:48 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

మలేరియా, డెంగ్యూ నియంత్రణ చర్యలను మరింత పటిష్టంగా చేపట్టాలి : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారామ్ రాథోడ్

Date : 05 October 2026 05:07 PM Views : 136

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా ఉప వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం పాల్వంచ నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారామ్ రాథోడ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మలేరియా, డెంగ్యూ వ్యాధుల నియంత్రణ, ముందస్తు గుర్తింపు, పరీక్షలు మరియు నివారణ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారామ్ రాథోడ్ సంబంధిత అధికారులకు, సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ల్యాబ్ టెక్నీషియన్లు, సబ్‌యూనిట్ అధికారులు, మలేరియా టెక్నీషియన్లు, సపోర్ట్ సూపర్‌వైజర్లు తదితరులతో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ఆరోగ్య కేంద్రాల్లో జరుగుతున్న మలేరియా, డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు, కేసుల గుర్తింపు, సబ్‌సెంటర్ వారీ పనితీరు, పరీక్షా కిట్ల నిల్వ తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. సమీక్షించిన ముఖ్య అంశాలు: జిల్లాలో నమోదైన Pv (Plasmodium vivax), Pf (Plasmodium falciparum) మలేరియా పాజిటివ్ కేసుల వివరాలను సమీక్షించారు. డెంగ్యూ పాజిటివ్ కేసుల పరిస్థితి, పరీక్షలు మరియు సంబంధిత నిఘా చర్యలను పరిశీలించారు. సబ్‌సెంటర్ వారీగా పరీక్షల నిర్వహణ, కేసుల గుర్తింపు మరియు పనితీరును సమీక్షించారు. ప్రతి ఆరోగ్య కేంద్రం వారీగా మలేరియా, డెంగ్యూ నిర్ధారణ పరీక్షల పురోగతిని పరిశీలించారు. అనుమానిత జ్వర కేసులను నిర్లక్ష్యం చేయకుండా ఫీల్డ్ స్థాయిలో RDTల ద్వారా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. సబ్‌సెంటర్ స్థాయిలో కూడా అవసరమైన వారికి RDT పరీక్షలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్న మలేరియా, డెంగ్యూ టెస్టింగ్ కిట్ల స్టాక్ పొజిషన్‌ను సమీక్షించారు. అధికంగా టెస్టింగ్ కిట్లు ఉన్న కేంద్రాలను గుర్తించి, కిట్లు లేని లేదా తక్కువ నిల్వ ఉన్న ఆరోగ్య కేంద్రాలకు అదనపు కిట్లను పునఃపంపిణీ చేయాలని సూచించారు. అవసరమైన కేంద్రాలకు టెస్టింగ్ కిట్లను T-HUB వాహనాల ద్వారా త్వరితగతిన తరలించి, పరీక్షా సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. ఫీల్డ్ స్థాయి నిఘాపై ప్రత్యేక దృష్టి జ్వరంతో బాధపడుతున్న ప్రతి వ్యక్తిని సకాలంలో గుర్తించి అవసరమైన పరీక్షలు నిర్వహించాలని DMHO డా. తుకారామ్ రాథోడ్ సూచించారు. ముఖ్యంగా మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఫీవర్ సర్వేలు, RDT పరీక్షలు, కేసుల గుర్తింపు, నిర్ధారణ అనంతరం తగిన చికిత్స మరియు ఫాలోఅప్ చర్యలను పటిష్టంగా నిర్వహించాలని తెలిపారు. అలాగే, ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షా కిట్ల కొరత ఏర్పడకుండా స్టాక్‌ను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరాన్ని బట్టి ఒక కేంద్రం నుంచి మరొక కేంద్రానికి కిట్లను పునఃపంపిణీ చేయాలని సూచించారు. ప్రజలకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని స్థాయిల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, మలేరియా మరియు డెంగ్యూ వ్యాధుల నియంత్రణలో నిర్లక్ష్యానికి తావులేకుండా నిరంతర నిఘా, పరీక్షలు మరియు నివారణ చర్యలు చేపట్టాలని DMHO ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో డా. ఎం. శ్రీధర్, డిప్యూటీ DMHO, భద్రాచలం, శ్రీ రవి, అసిస్టెంట్ మలేరియా అధికారి, ల్యాబ్ టెక్నీషియన్లు, సబ్‌యూనిట్ అధికారులు, మలేరియా టెక్నీషియన్లు, సపోర్ట్ సూపర్‌వైజర్లు మరియు సంబంధిత ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :