Monday, 02 November 2026 05:32:46 PM
# ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # భారత కార్మిక పోరాట దిక్సూచి ఏఐటీయూసీ. 106 ఏళ్ల ఘన చరిత్ర కార్మిక వర్గానికే సొంతం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం సహించేది లేదు: కలెక్టర్ అంకిత్. # భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం.రక్తదానం ప్రాణదానంతో సమానం – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # జీవో నెంబర్ 76 లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలి.జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # కొత్తగూడెంలో కాంగ్రెస్ నూతన కార్యాలయం కోసం స్థల పరిశీలన. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. # జ్ఞానేష్ కుమార్ రాజీనామాకై రాజీలేని పోరాటం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా.

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 30 October 2026 05:23 PM Views : 51

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆలయ అభివృద్ధి పనుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిగా డీఆర్ఓ పద్మావతి నియామకం.పుష్కర ఘాట్ల అభివృద్ధి, రహదారుల విస్తరణకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలి. వీఐపీ, వీవీఐపీ అతిథి గృహాల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించాలి. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ అభివృద్ధి పనుల పురోగతి, వివిధ శాఖల అనుమతులు, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ, వివిధ శాఖల మధ్య సమన్వయం సాధించేందుకు ప్రత్యేక అధికారిగా జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతిని నియమిస్తున్నట్లు తెలిపారు. నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనులను వేగవంతం చేయాలని, అవసరమైన ప్రతిపాదనలు, అనుమతులను సంబంధిత శాఖల నుంచి త్వరితగతిన పొందాలని ఆదేశించారు. ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. చేపట్టిన పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, నిధులు, అనుమతుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని భద్రాచలంలోని పుష్కర ఘాట్ల అభివృద్ధి, విస్తరణతో పాటు భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలపై సమీక్షించారు. పుష్కరాల సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున స్నానపు ప్రదేశాలు, రాకపోకలకు అనువైన మార్గాలు, భద్రత, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి సదుపాయాలపై ముందస్తు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఘాట్ల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన పనులను గుర్తించి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.రామాలయం నుంచి పుష్కర ఘాట్‌కు వెళ్లే మార్గంలో ఉన్న 47 ఇళ్ల తొలగింపునకు సంబంధించిన అంశాన్ని సమీక్షిస్తూ, ఆయా నిర్మాణాల వివరాలు, విలువ అంచనాలు, నిర్వాసితులకు కల్పించాల్సిన పునరావాసం, పరిహారం (ఆర్ అండ్ ఆర్)పై చర్చించారు. బాధితులకు నిబంధనల ప్రకారం పునరావాసం, పరిహారం అందించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. భద్రాచలం బ్రిడ్జిట్ నుండి పుష్కర ఘాట్ లకు రహదారి విస్తరణకు అవసరమైన భూమి, నిర్మాణాలు, భూసేకరణ అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదిక రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. పుష్కర ఘాట్‌కు అనుసంధానంగా నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. పుష్కరాల సమయంలో భక్తులు, యాత్రికుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.భద్రాచలంలో వీఐపీ, వీవీఐపీ అతిథి గృహాల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించాలని సూచించారు. అన్ని వసతులతో ఆరు సూట్లతో కూడిన అతిథి గృహ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, అధికారులు క్షేత్రస్థాయిలో స్థలాలను పరిశీలించి తగిన ప్రదేశాన్ని ఎంపిక చేయాలని తెలిపారు. అవసరమైన భూసేకరణ ప్రక్రియను ప్రారంభించి, సంబంధిత శాఖల అనుమతులతో ప్రతిపాదనలను త్వరితగతిన ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు.గోదావరి పుష్కరాల నాటికి ఆలయం, ఘాట్లు, పట్టణ పరిసర ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేలా శాఖల వారీగా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ తెలిపారు. గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, అధికారులకు అప్పగించిన బాధ్యతలు, పనుల పురోగతికి సంబంధించిన మినిట్స్‌ను తప్పనిసరిగా నమోదు చేయాలని, తదుపరి సమీక్షలో వాటి ఆధారంగా పురోగతిని పరిశీలిస్తామని స్పష్టం చేశారు. పనుల అమలులో ఎదురయ్యే సమస్యలను వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి (సీపీఓ) సునీత, జిల్లా పంచాయతీ అధికారి అనూష, భద్రాచలం దేవస్థానం ఈఓ దామోదర్ రావు, ఆర్ అండ్ బి ఈఈ నాగేశ్వరరావు, భద్రాచలం తహసీల్దార్ రామ్ కుమార్, దుమ్ముగూడెం తహసీల్దార్ భగవాన్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ అధికారులు, వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :