తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆకలి తీర్చే సేవ కంటే గొప్ప సేవ మరొకటి లేదని యామిని మల్టీస్పెషాలిటీ ప్రముఖ పిల్లల వైద్యురాలు సిరిశెట్టి యామిని కుమారి అన్నారు.గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మధురబస్తీలో రాజేందర్ మెమోరియల్ యూత్ ఆధ్వర్యంలో ఆదివారం మహా అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు.తొలుత లక్ష్మీగణపతి మందిరంలో విగ్రహదాతలు దుగ్గి శివప్రసాద్ దంపతులు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని డాక్టర్ యామిని కుమారి ప్రారంభించి మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా రాజేందర్ మెమోరియల్ యూత్ సభ్యులు,మథుర బస్తీ భక్త బృందం ఎంతో భక్తిశ్రద్ధలతో గణనాథుని నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారని.గణేష్ నిమజ్జనం అనంతరం పవిత్ర గోదావరి నదీ తీరంలో నిమజ్జనం అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగించడం,ఇంత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించిన రాజేందర్ మెమోరియల్ యూత్ సభ్యులు,ఉత్సవ కమిటీ సభ్యులు,మధురబస్తీ భక్త బృందం సభ్యులను వారు అభినందించారు. ఈ మహా అన్నదాన కార్యక్రమంలో యామిని హాస్పిటల్ ఆర్థోపెడిక్ వైద్యులు నరసింహ సంజీవ్ రావు,జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ)స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్,యెర్రా లింగేష్,ఎడారి లక్ష్మణ్,కనగాల లక్కీ,జంగం జస్వంత్,ధనుంజయ్,సిద్దు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ