తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రైతులు దేశానికి వెన్నెముక వంటివారని కొత్తగూడెం మేయర్ గణేష్ పేర్కొన్నారు. కొత్తగూడెంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో (కేవీకే) జరిగిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు.రైతులు మెరుగైన వ్యవసాయ పద్ధతులను అవలంబించి, అధిక దిగుబడులు సాధించేందుకు కృషి విజ్ఞాన కేంద్రం అందించే సాంకేతిక సేవలు, సలహాలు, సూచనలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అనంతరం సదస్సుకు హాజరైన రైతులకు జొన్న విత్తనాలను పంపిణీ చేశారు. వ్యవసాయ రంగంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా అభినందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ