తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తన చేతి కర్రను ఉపాధ్యాయ, రక్షణ వ్యవస్థలకు అందించాలి... మహాత్ముడు మళ్లీ పుట్టి రావాలని 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ అన్నారు. శుక్రవారం మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని రామవరం హై స్కూల్ లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి మునిగడప పద్మ దంపతులు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళలపై చిన్న పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్న ఏమీ చేయలేని దుస్థితిలో చట్టాలు, ప్రభుత్వాలు ఉన్నాయని అందుకే ఓ మహాత్మ మళ్ళీ మీరు రావాలి ఈ సమాజాన్ని ఒక క్రమ పద్ధతిలో నడిపించాలని 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ వెంకటేశ్వర్లు అన్నారు. ఉపాధ్యాయులకు,రక్షక బటులకు ఆయన చేతి ఊత కర్రను అందించి గాడి తప్పిన సమాజాన్ని సరైన గమ్యంలో నడిచేలా చూడాలని మునిగడప పద్మ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పుస్తక జ్ఞాన సంపదను మరిచి చరవాణి మోజులో యువత పెడమార్గంలో ప్రయాణిస్తున్నారని, ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హానికర మత్తుపదార్థాల తయారీకి అనుమతిస్తూ ప్రభుత్వాలే ప్రోత్సహించి ప్రజా వ్యవస్థను చిన్న భిన్నం చేస్తున్నారని అన్నారు. పైకి మాత్రం మత్తు పదార్థాలు హానికరం అంటూ ప్రచారానికే పరిమితం అవుతున్నారని విమర్శించారు..ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే మద్యపానాన్ని, మత్తు పదార్థాల తయారీని ఆపే చట్టాలు తేవాలని ఆమె ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. అప్పుడే మనం మహాత్ముడికి ఘనమైన నివాళులు ఇచ్చినట్లు అవుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, న్యాయవాది మునిగడప వెంకటేశ్వర్లు,గుంజా వెంకన్న, చింటూ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ