తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గణేష్ మండపాలకు హోమ చూర్ణం,ఆవు నెయ్యి పంపిణీ.గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు యెర్రా కామేష్.వరసిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గణేష్ మండపాల నిర్వాహకులకు ఉచితంగా హోమ చూర్ణం,ఆవు నెయ్యిని పంపిణీ చేస్తున్నట్లు గణేష్ నిమజ్జన కమిటీ అధ్యక్షులు యెర్రా కామేష్ తెలిపారు.మంగళవారం కొత్తగూడెంలోని స్థానిక వివేకానంద హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగింపు కార్యక్రమంలో ఆయా గణేష్ మండపాల వద్ద హోమ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.ప్రతీ ఒక్కరూ భక్తి భావంతో ఈ వినాయక ఉత్సవాలు జరుపుకుంటున్నారని ముఖ్యంగా యువత ఎటువంటి చెడు వ్యసనాలకు లోనూ కాకుండా మాలలు ధరించి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం శుభసూచకమని పేర్కొన్నారు. నిమర్జనం వరకు ఇదే స్ఫూర్తిని కొనసాగించి శాంతియుత వాతావరణంలో పూర్తి చేయాలని అధికారులకు,ఉత్సవ కమిటీ వారికి సహకరించాలని కోరారు.25వ తేదీన సాయంత్రం 3గంటల కల్లా వినాయక విగ్రహాలు ప్రకాశం స్టేడియం చేరుకోవాలని కోరారు.ఈసంప్రదాయాన్ని కొనసాగిస్తూ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ఉత్సవ మండపాల నిర్వాహకులకు హోమ చూర్ణం,ఆవు నెయ్యిని ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు.భక్తిశ్రద్ధలతో హోమ కార్యక్రమాలను నిర్వహించేందుకు అవసరమైన సామగ్రిని అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు..గణేష్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన మండపాల నిర్వాహకులు,భక్తులకు ఆయన అభినందనలు తెలిపారు.ఈకార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి నాగేశ్వరరావు,ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి దారా రమేష్,వందనపూ శ్రీధర్,అకిరెడ్డి మహేష్,మెరుగు చింటేశ్వర్,అగుల యాకయ్య,కుసనా సాగర్,నాగుల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ