Monday, 02 November 2026 07:00:23 PM
# పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలి: డీఆర్వో పద్మావతి

Date : 23 October 2026 05:34 PM Views : 118

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలి: డీఆర్వో పద్మావతి.ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో భద్రతా చర్యలు వేగవంతం చేయాలి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి ఆదేశించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి, అక్కడ భద్రతా చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలోని అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో జిల్లాలో నమోదైన రోడ్డు ప్రమాదాలు, మరణాలు, గాయపడిన వారి వివరాలతో పాటు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు.జిల్లాలో జనవరి 1 నుంచి అక్టోబర్ 15 వరకు మొత్తం 410 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయని అధికారులు వివరించారు. వీటిలో 179 ప్రాణాంతక ప్రమాదాలు కాగా, 231 ప్రాణాపాయం లేని ప్రమాదాలుగా నమోదయ్యాయి. ఈ ప్రమాదాల్లో 191 మంది ప్రాణాలు కోల్పోగా, 26 మంది తీవ్రంగా, 383 మంది స్వల్పంగా గాయపడ్డారు. నమోదైన మొత్తం 410 ప్రమాదాలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. రోడ్డు ప్రమాదాల కారణంగా విలువైన ప్రాణాలు కోల్పోతుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన డీఆర్వో, ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.రహదారుల వారీగా ప్రమాదాల వివరాలను పరిశీలిస్తే జాతీయ రహదారులపై అత్యధికంగా 177 ప్రమాదాలు జరిగి 75 మంది మృతి చెందారు. గ్రామీణ రహదారులపై 71 ప్రమాదాల్లో 41 మంది, ఇతర జిల్లా రహదారులపై 66 ప్రమాదాల్లో 33 మంది, రాష్ట్ర రహదారులపై 54 ప్రమాదాల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. స్థానిక రహదారులపై 31 ప్రమాదాల్లో 16 మంది, ప్రధాన జిల్లా రహదారులపై ఆరు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందినట్లు అధికారులు వివరించారు. ప్రమాదాలు అధికంగా నమోదవుతున్న రహదారులను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని డీఆర్వో ఆదేశించారు. అక్టోబర్ 1 నుంచి 15 వరకు జిల్లాలో 21 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా, వీటిలో 10 ప్రాణాంతక ప్రమాదాలు నమోదయ్యాయి. ఈ పదిహేను రోజుల వ్యవధిలోనే 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల జరిగిన ప్రమాదాలకు గల కారణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని డీఆర్వో సూచించారు.ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి, అవసరమైన చోట హెచ్చరిక బోర్డులు, రోడ్ మార్కింగ్‌లు, రిఫ్లెక్టర్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రమాదకర మలుపులు, కూడళ్లు, రహదారులపై ఉన్న ఇతర సమస్యలను గుర్తించి, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని తెలిపారు. రహదారుల భద్రతకు సంబంధించిన పనుల్లో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డీఆర్వో పద్మావతి సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లు తదితర వాహనదారులు సీట్‌బెల్ట్ వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై పోలీస్, రవాణా శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.జిల్లాలో నమోదైన హిట్‌ అండ్‌ రన్‌ కేసుల వివరాలను అధికారులు సమావేశంలో వివరించారు. మొత్తం ఎనిమిది కేసులు నమోదు కాగా, బూర్గంపహాడ్, టేకులపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండేసి కేసులు, అన్నపురెడ్డిపల్లి, దమ్మపేట, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒక్కొక్క కేసు నమోదైనట్లు తెలిపారు. ఇటువంటి ఘటనలపై తగిన చర్యలు తీసుకుంటూ, బాధితులకు సకాలంలో సహాయం అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని డీఆర్వో అన్నారు . ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటికి గల కారణాలను గుర్తించి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తూ రోడ్డు ప్రమాదాలు, మరణాలు, గాయాల సంఖ్యను తగ్గించే దిశగా కృషి చేయాలని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా రవాణా శాఖ అధికారి భూషిత్ రెడ్డి, డీఆర్‌ఎం జి. బాలాజీ, జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి సిహెచ్ వెంకటేశ్వర్లు,డీఎస్పీ వెంకన్న బాబు, జిల్లా వైద్య శాఖ అధికారులు , ఆర్‌అండ్‌బీ ఈఈ, ట్రాఫిక్ ఎస్‌ఐ, కలెక్టరేట్ సీ సెక్షన్ అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :