తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలోని హెడ్ ఆఫీస్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున పాల వ్యాన్ బోల్తా పడింది. పాలు లోడుతో వెళ్తున్న పాల వ్యాన్ అదుపుతప్పి రహదారి పక్కకు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లోని పాల ప్యాకెట్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని డ్రైవర్, క్లీనర్‌ను సురక్షితంగా బయటకు తీశారు. వారికి స్వల్ప గాయాలయ్యాయి.
Admin
తెలుగు వెలుగు టీవీ