Monday, 02 November 2026 09:05:55 PM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

జూలూరుపాడు పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Date : 09 October 2026 06:22 PM Views : 596

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.జూలూరుపాడు పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.వార్షిక తనిఖీలలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ జూలూరుపాడు పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌ను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వివిధ సమస్యలతో వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో నమోదైన యూఐ కేసులు, గ్రేవ్ కేసులు, ప్రాపర్టీ కేసుల వివరాలను సమీక్షించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నాణ్యమైన దర్యాప్తు ద్వారా కేసులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌లోని క్రైమ్ రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించాలని, ప్రతి కేసుకు సంబంధించిన వివరాలు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ అంశాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. క్రైమ్ ప్రాపర్టీ నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, స్వాధీనం చేసుకున్న ఆస్తుల భద్రత, గుర్తింపు, కోర్టు సంబంధిత ప్రక్రియలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.సీసీటీఎన్ఎస్ 2.0లో కేసుల వివరాలను సక్రమంగా నమోదు చేయడంతో పాటు ఈ-సాక్ష్య, నాట్‌గ్రిడ్, గాండీవ వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. గత నేర చరిత్ర కలిగిన వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి, యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకొని, సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ, సీఐ శ్రీలక్ష్మి, ఎస్సైలు జీనత్ కుమార్,మనీషా, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :