Monday, 02 November 2026 11:30:52 PM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు గోనె మణి.

Date : 21 September 2026 07:23 PM Views : 224

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అధికారుల నిర్లక్ష్యంతోనే బిల్లుల జాప్యం.పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి.అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు సరఫరా చేయాలి. యాప్‌లో ఎన్‌హెచ్‌టీఎస్ డిలీట్ ఆప్షన్ ఇవ్వాలి.అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు గోనె మణి.ఐసీడీఎస్ పీడీ, సంబంధిత అధికారుల తీవ్ర నిర్లక్ష్యం వల్లే అంగన్వాడీ బిల్లులు సకాలంలో మంజూరు కావడం లేదని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు గోనె మణి మండిపడ్డారు. సోమవారం స్థానిక ఏఐటీయూసీ జిల్లా కార్యాలయం 'శేషగిరిభవన్'లో నిర్వహించిన సంఘ జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అధికారులు సకాలంలో బిల్లులను ప్రభుత్వానికి సమర్పించకపోవడం వల్లే తీవ్ర జాప్యం జరుగుతోందని ఆమె ఆరోపించారు. 2025 నుంచి నేటివరకు అంగన్వాడీ కేంద్రాల అద్దె బిల్లులు చెల్లించకపోవడంతో, భవనాల యజమానులు కేంద్రాలను తక్షణమే ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆరు నెలలుగా ఆరోగ్య లక్ష్మి మెనూ బిల్లులతో పాటు గ్యాస్ సిలిండర్ల బిల్లులను సైతం విడుదల చేయకుండా టీచర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కేంద్రాలకు నిత్యావసర సరుకుల సరఫరా సక్రమంగా జరగడం లేదని, దీంతో క్షేత్రస్థాయిలో నిర్వహణ భారంగా మారిందని పేర్కొన్నారు. అంగన్వాడీ మొబైల్ యాప్‌లో తప్పులు సరిచేసేందుకు ఎన్‌హెచ్‌టీఎస్ డిలీట్ ఆప్షన్‌ను నేరుగా టీచర్లకే కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. అధికారులు ఇప్పటికైనా బాధ్యతారాహిత్యాన్ని వీడి పెండింగ్ సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు శ్రీదేవి, సరోజ, రమాదేవి, భవాని, ప్రమీల, కమల తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :