తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి. అక్టోబర్ 25లోపు అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలి. ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియలో భాగంగా రానున్న 30 నుంచి 40 రోజులు ప్రత్యేక దృష్టి సారించి, నిర్దేశిత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.ఎస్‌ఐఆర్–2026 కార్యక్రమంపై సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీఓసీ కార్యాలయ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, ఐటీడీఏ పీవో రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్టతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల పరిష్కారంలో ఆశించిన స్థాయిలో పురోగతి లేదని, వాటిని వేగవంతంగా పరిష్కరించాలని సూచించారు. నోటీసులు జారీ చేయడంతో పాటు తదుపరి చర్యలు చేపట్టి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. చివరి నిమిషం వరకు దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా ముందుగానే పరిష్కరించాలని స్పష్టం చేశారు.డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని, ప్రతి బీఎల్‌ఓకు నిర్దిష్ట లక్ష్యాలను కేటాయించి వారి పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అనామలీస్, ఇతర మ్యాపింగ్‌కు సంబంధించి ఓటర్లకు జారీ చేయాల్సిన నోటీసులు, విచారణ, పరిష్కార ప్రక్రియలను అక్టోబర్ చివరి వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.ఎస్‌ఐఆర్–2026కు సంబంధించిన అన్ని ప్రక్రియలను అక్టోబర్ 25లోపు పూర్తి చేయాలని, చివరి 10 రోజులను అవసరమైన సవరణలు, ఇతర ప్రక్రియల కోసం కేటాయించుకోవాలని తెలిపారు.ఫారం-6 సమర్పించే సమయంలో డిక్లరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా అందజేయాలని స్పష్టం చేశారు. అర్హులైన ఓటర్లు ఫారం-6తో పాటు అవసరమైన డిక్లరేషన్, సంబంధిత పత్రాలను సమర్పించేలా బీఎల్‌ఓలు అవగాహన కల్పించాలని సూచించారు.ఓటర్లకు జారీ చేసే నోటీసులను బీఎల్‌ఓలు మాత్రమే పంపిణీ చేయాలని, బీఎల్‌ఏలను నోటీసుల పంపిణీలో భాగస్వాములను చేయరాదని స్పష్టం చేశారు. అవసరమైన సందర్భాల్లో బీఎల్‌ఏలు ఇళ్లను గుర్తించడంలో సహకరించవచ్చని తెలిపారు. బీఎల్‌ఏల ద్వారా నోటీసులు పంపిణీ చేసినట్లు గుర్తిస్తే సంబంధిత బీఎల్‌ఓపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.వయోవృద్ధులు, దివ్యాంగులు, విదేశాల్లో ఉన్న ఓటర్ల తరఫున వారి కుటుంబ సభ్యులు విచారణకు హాజరై సంబంధిత పత్రాలను సమర్పించవచ్చని తెలిపారు. ఈ విషయాన్ని బీఎల్‌ఓలు సంబంధిత ఓటర్లు, వారి కుటుంబ సభ్యులకు తెలియజేయాలని సూచించారు.బీఎల్‌ఓ స్థాయిలో ఐదు రోజులకు మించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు క్రమం తప్పకుండా సమీక్షించాలని ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులను గుర్తించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌ఐఆర్–2026లో నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.బీఎల్‌ఓ స్థాయిలో ఐదు రోజులకు మించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ప్రత్యేకంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. నోటీసుల జారీ, విచారణ, దరఖాస్తుల పరిష్కారం వంటి ప్రతి ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని తెలిపారు.అక్టోబర్ 25 గడువును దృష్టిలో ఉంచుకుని ముందస్తు కార్యాచరణతో పనిచేయాలని, చివరి దశలో పనులు పేరుకుపోకుండా ప్రతిరోజూ పురోగతిని సమీక్షించాలని కలెక్టర్ సూచించారు. ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఏఈఆర్‌ఓలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ