Tuesday, 03 November 2026 12:12:52 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

రక్తదానం ప్రాణదాతగా నిలుస్తుంది : ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ కె ఫహీమ్

Date : 02 October 2026 05:26 PM Views : 149

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సేవాభావంతో యువత ముందుకు సాగాలి గాంధీజీ ఆశయాల సాధనకు కృషి చేయాలి సామాజిక బాధ్యతగా రక్తదాన శిబిరం నిర్వహించాం రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న ఎందరో ప్రాణాలను కాపాడవచ్చని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ కె ఫహీమ్ అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాఖ్య నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత నిత్యం సేవా దృక్పథంతో, సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గాంధీజీ బోధించిన సేవ, త్యాగనిరతిని ప్రతిఒక్కరూ అలవర్చుకోవాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేయడమే కాకుండా, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం అభినందనీయమన్నారు. ఆస్పత్రుల్లో నిరుపేద రోగులకు అత్యవసర సమయాల్లో రక్తం అందక ప్రాణాలు కోల్పోకుండా చూసేందుకు ఈ రక్తదాన శిబిరం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లోనూ యువతను ఐక్యం చేస్తూ ప్రజా సమస్యలపై పోరాటాలతో పాటు విస్తృతంగా సమాజసేవ కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఖయ్యుమ్, ఎండి జావీద్, కొయ్యడ రవి, శ్రీకాంత్, విజయ్ కాంత్, రౌతు సురేష్, మోతె కృష్ణ, బాబా,దాసరి శివ తదితరులు రక్తదానం చేసిన వారిలో ఉన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :