Monday, 02 November 2026 09:05:54 PM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

మేడి అఖిల్ హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్.హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, సెల్‌ఫోన్లు స్వాధీనం.

Date : 28 October 2026 11:25 AM Views : 388

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎదురుగడ్డ గ్రామానికి చెందిన మేడి అఖిల్ హత్య కేసులో పరారీలో ఉన్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు టెక్నికల్ టీమ్ సహకారంతో సాంకేతిక ఆధారాలను విశ్లేషించి కేసును ఛేదించినట్లు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వెల్లడించారు.నమ్మదగిన సమాచారం మేరకు లక్ష్మీదేవిపల్లి ఎస్సై అఖిల తన సిబ్బందితో కలిసి కొత్తగూడెం బస్‌స్టాండ్ సమీపంలో నిందితులు దంత్యాల గణేష్ అలియాస్ గని, సిరిపురం సాత్విక్ అలియాస్ చిన్సు, ముద్దంగుల వెంకటేష్ అలియాస్ చిన్ని, తరాల ప్రదీప్‌లను అదుపులోకి తీసుకున్నారు.విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం, గతంలో జరిగిన గొడవలు, వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ప్రధాన నిందితులుగా పేర్కొన్న గణేష్, సాత్విక్‌లు అఖిల్‌పై పగ పెంచుకొని హత్యకు పథకం రచించారు. ఇందులో భాగంగా మద్యం తాగిస్తామని నమ్మించి అఖిల్‌ను ఎదురుగడ్డ గ్రామంలోని రేకుల షెడ్డు సమీపంలోని ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లారు. 19.10.2026 తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో గణేష్ కత్తితో అఖిల్ మెడపై పలుమార్లు పొడిచి, సిమెంట్ ఇటుకతో ముఖంపై దాడి చేయగా, సాత్విక్ కూడా సిమెంట్ ఇటుకతో దాడి చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ దాడిలో అఖిల్ మృతి చెందాడు.ఈ హత్యకు సంబంధించి మిగిలిన నిందితులు సైతం ముందస్తు పథకంలో భాగంగా సహకరించినట్లు, మద్యం కొనుగోలు తదితర అవసరాల కోసం ఫోన్‌పే ద్వారా నగదు లావాదేవీలు జరిగినట్లు విచారణలో గుర్తించారు.నిందితుల వద్ద నుంచి మూడు సెల్‌ఫోన్లు, ఫోన్‌పే లావాదేవీలకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకలు ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకొని, తదితర ఆధారాలకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.ఈ సందర్భంగా డీఎస్పీ ఆదినారాయణ మాట్లాడుతూ, వ్యక్తిగత కక్షలు, పాత గొడవల కారణంగా హింసాత్మక చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చిన్నచిన్న వివాదాలను పెద్దవిగా చేసుకొని నేరాలకు పాల్పడవద్దని, సమస్యలు తలెత్తినప్పుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. నేరాలకు పాల్పడిన వారు ఎంతకాలం పరారీలో ఉన్నా సాంకేతిక ఆధారాలు, పోలీసుల దర్యాప్తు ద్వారా గుర్తించి చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు.ఈ కేసులో నిందితుల పాత్ర, ఆర్థిక లావాదేవీలు, ఇతరుల ప్రమేయం తదితర అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపై చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.ఈ కేసును ఛేదించడంలో టెక్నికల్ టీమ్ సహకారం కీలకంగా నిలిచిందని డీఎస్పీ ఆదినారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అఖిల, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :