Tuesday, 03 November 2026 12:12:50 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి : ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్

Date : 05 October 2026 05:33 PM Views : 187

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంగన్వాడీ కేంద్రాలకు నిధులు విడుదల చేయాలి వేతన పెంపు హామీని తక్షణమే అమలు చేయాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్, సెలవులు ఇవ్వాలి : ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్ అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు గత ఏడాది కాలంగా అద్దెలు, గ్యాస్ ఛార్జీలు, ఆరోగ్యలక్ష్మి నిధులు, ఈవెంట్ బిల్లులు పేరుకుపోయి కేంద్రాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు సొంత నిధులతో కేంద్రాలను నడపలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా నెలకు రూ.18 వేల వేతన పెంపును వెంటనే అమలు చేయాలని, దసరా పండుగ సెలవులు మంజూరు చేయడంతో పాటు పదవీ విరమణ పొందే ఉద్యోగులకు గౌరవప్రదమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడి సమస్యలను పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ, సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు వేల్పుల మల్లికార్జున్, భూక్యా శ్రీనివాస్, గోనే మణి, రెడ్డి అరుణ, భూక్యా లలిత, విజయ, భారతి, సంధ్య, ప్రమీల, చిన్నారి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :