తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రపంచ బాలికల దినోత్సవం సందర్భంగా వాక్ ఫర్ ట్రీస్ వ్యవస్థాపకుడు వనజీవి విశ్వామిత్ర చౌహాన్ కొత్తగూడెం సెంట్రల్ పార్క్ ఆవరణంలో తన 1592వ మొక్కగా పనస మొక్కను నాటి బాలికలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా విశ్వామిత్ర చౌహాన్ మాట్లాడుతూ బాలిక అంటే భవిష్యత్తుకు భరోసా.. మొక్క అంటే ప్రకృతికి ప్రాణం ఇద్దరూ పెరిగితేనే సమాజం వర్ధిల్లుతుంది బాలికను ప్రేమగా పెంచినట్లే మొక్కను కూడా ప్రేమగా పెంచాలి బాలిక చదువుకుంటే ఒక కుటుంబం బాగుపడుతుంది ఒక మొక్క పెరిగితే వందల జీవులకు ప్రాణవాయువు అందుతుంది అని అన్నారు.వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ లో భాగంగా ఈ రోజు బాలికల దినోత్సవం సందర్భంగా 1592వ మొక్కను నాటడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆడపిల్లను ఆకాశమంత ఎత్తుకు ఎదగనివ్వాలి మొక్కను భూమిలో లోతుగా వేళ్లూ పోనివ్వాలి ఇద్దరికీ రక్షణ ప్రేమ గౌరవం అవసరం అని పేర్కొన్నారు.చిన్నారులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించిన చౌహాన్ మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం ఆడపిల్లలను చదివిద్దాం దేశాన్ని ముందుకు నడిపిద్దాం అనే నినాదంతో పిల్లల్లో అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా చిన్నారులు మొక్కల ప్రాముఖ్యత బాలికల విద్య ఆవశ్యకతపై ప్రతిజ్ఞ చేశారు. వాక్ ఫర్ ట్రీస్ అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ మొక్కలు నాటుతున్న విశ్వామిత్ర చౌహాన్ కృషిని పార్కు కు వచ్చిన సందర్శకులు అభినందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ